Bigg Boss 9 : హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ శాతం మందికి సుపరిచితం అయిన వాళ్లలో సుమన్ శెట్టి ఒకరు. అలానే జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్న ఇమ్మానియేల్ కూడా ఒకరు. ఇమ్మానుయేల్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చినప్పటి నుంచే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. అయితే ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉంటుంది. ఎవరిని ఏ మాటలు హర్ట్ చేస్తాయి అని ఎవరు పెద్దగా ఊహించలేరు.
ఒక టైం లో మాస్క్ మెన్ హరీష్ ని ఉద్దేశిస్తూ గుండు అంకుల్ అని ఇమ్మానుయేల్ అన్నాడు. దానికి హరీష్ (Haritha Harish) విపరీతంగా ఫీల్ అయిపోయారు. బాడీ సేమింగ్ అంటూ ఇమాన్యుల్ పై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నాగర్జున కూడా అతను ఎంటర్టైనర్ అదే వేలో చెప్పాడు అంటూ కొంత శాతం ఇమ్మానియేల్ కి సపోర్ట్ గానే మాట్లాడారు.
రెండవ వారం నామినేషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్స్ లో ఇమ్మానుయేల్ మొదట మనీష్ ను నామినేట్ చేశాడు. సంచాలక్ గా తనకు సరైన న్యాయం కెప్టెన్సీ గేమ్ లో చేయలేదు అనేది తన మొదటి కారణం.
అలానే హరీష్ ను నామినేట్ చేశారు. రెడ్ ఫ్లవర్ అనే విషయాన్ని మరోసారి ఇమ్మానుయేల్ ప్రస్తావించి దాని గురించి క్లారిటీగా అడిగాను. హరీష్ తన విషయాన్ని తను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు అంటూ చెప్పాడు.
మొత్తానికి వీరిద్దరికీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు నరాలు తెగిపోయేలా అరుచుకున్నారు. ఈ పంచాయతీ చూస్తుంటే ఇప్పట్లో తెగేలా లేదు.
Also Read: Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా