BigTV English

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 నామినేషన్స్.. అతనే సెకండ్ ఎలిమినేట్..? ఒక్కొక్కరికి షాక్..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 నామినేషన్స్.. అతనే సెకండ్ ఎలిమినేట్..? ఒక్కొక్కరికి షాక్..

Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గతవారం ప్రారంభమైంది.. గత వారానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ ఎలిమినేట్ అయింది.. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గత వారంలో లాగే ఈ వారం కూడా నామినేషన్స్ రచ్చతోనే మొదలయ్యాయి. అయితే ఈసారి హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ నామినేషన్స్ లో మనీష్ నే ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఎపిసోడ్లో అతనికి ఎక్కువగా రంగు పడింది. నామినేషన్స్ తో పాటుగా కామనర్స్ ఎవరికి వారే అన్నట్లు ఒకరిలో ఒకరు కొట్టుకోవడం వరకు వెళ్లారు. మరి ఈ వారం నామినేషన్ లిస్టులో ఉన్న కంటెస్టెంట్లు ఎవరో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…


రెండో వారం ఎలిమినేట్ అయ్యేది అతనే..?

బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటివారం నామినేషన్స్ మాస్క్ మాన్ హరీష్ కి నాగార్జున క్లాస్ పీకడంతో పాటుగా అతని బాగోతాన్ని బయటపెట్టాడు. దాంతో మనోడి పరిస్థితి ఫ్యుజులు ఎగిరిపోయినట్లయ్యింది. చివరి వరకు ఇతనే ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో బిగ్బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో అతను సేఫ్ అయ్యాడు. పవన్ శ్రేష్ట వర్మ ఫైనల్ గా ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చారు. మొత్తానికి శ్రేష్ట వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈమె ఒక వారానికి లక్షల్లో నే రెమ్యూనిరేషన్ తీసుకుంది. ఇక అందరూ రెండో వారం నామినేషన్ పై ఆసక్తిగా కనబరుస్తున్నారు. ఈ రెండో వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఎక్కువగా సామాన్యులే నామినేట్ అవ్వడం గమనార్హం. మొత్తానికి చూసుకుంటే మనీష్ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఫైనల్ గా వీకెండ్ వచ్చేసరికి మారుతుందేమో చూడాలి.

Also Read: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..


నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యులు కాస్త ఓవర్ గా చేస్తున్నారు. శ్రీజ-మనీష్ వాదులాడుకున్నారు. నీ పనే అరవడం కదా అని శ్రీజతోనే మనీష్ అనేసరికి ఈమె హర్ట్ అయిపోయింది. పాయింట్ అవుట్ చేసేస్తున్నారని మూలకు వెళ్లి ఏడవడం నీ పని అని మనీష్‌కి ఇచ్చిపడేసింది.. కామనర్స్ అనేదానికి వీళ్లు ఓ గలీజ్ మార్క్, వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మాన్యుయేల్‌తో చెబుతూ తెగ బాధపడుతున్నాడు. ఇది కాస్త ఓవరాక్షన్ అనే విధంగా అతను చేస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మొత్తానికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లను చూస్తే.. 14 మందిలో దాదాపు 8 మంది నామినేట్ అయ్యారు. హరీష్, భరణి,మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈసారి సామాన్యుల నుంచి నలుగురు, సెలబ్రిటీల నుంచి ఇద్దరు నామినేట్ అయ్యారు.. మరి ఈ లిస్టులో నుంచి ఎక్కువగా మనిష్ బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్టు బిగ్ బాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈవారం ఎవరు హౌస్ నుంచి పెట్టే సర్దుకుని వెళ్తారో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి

Bigg Boss 9 : వీళ్లు కామనర్స్ కాదు, సెల్ఫిష్ రూతులస్ ఇడియట్స్

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్.. హౌస్‌లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Big Stories

×