BigTV English

Pathum Nisanka : హిస్ట‌రీ క్రియేట్ చేసిన నిసాంక‌.. తొలి శ్రీలంక ఆట‌గాడిగా..

Pathum Nisanka :  హిస్ట‌రీ క్రియేట్ చేసిన నిసాంక‌.. తొలి శ్రీలంక ఆట‌గాడిగా..

Pathum Nisanka :  ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో శ్రీలంక వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. అయితే నిసాంక 44 బంతుల్లో 68 ఎదుర్కొని విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే గ్రూపు-బీలో ఉన్న లంక జ‌ట్టు తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక రెండో మ్యాచ్ లో భాగంగా ప‌సికూన హాంకాంగ్ తో త‌ల‌పడిన శ్రీలంక‌.. గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించ‌డం గ‌మ‌నార్హం. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జ‌ట్టు ఫ‌స్ట్ బౌలింగ్ చేసింది. ఈ త‌రుణంలో బ్యాటింగ్ కి దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు సాధించింది.


Also Read : Glenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మ్యాక్స్ వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

పోరాడి ఓడిన హాంకాంగ్..

ముఖ్యంగా హాంకాంగ్ ఓపెన‌ర్లు జీష‌న్ అలీ(23), అన్షుమాన్ ర‌థ్ (48) శుభారంభం చేశారు. నాలుగో నెంబ‌ర్ బ్యాట‌ర్ నిజాక‌త్ ఖాన్ అజేయ మెరుపు హాప్ సెంచ‌రీతో అల‌రించాడు. అయితే హాంకాంగ్ విధించిన నామ‌మాత్ర‌పు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గ‌ట్టిగానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. హాంకాంగ్ బౌల‌ర్ల ధాటికి శ్రీలంక బ్యాట‌ర్లు పెవిలియ‌న్ కి క్యూ క‌ట్టారు. ఓపెన‌ర్ కుశాల్ మెండిస్ 11, క‌మిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ చ‌రిత్ అస‌లంక 2, క‌మిందు మెండిస్ 5 ప‌రుగులు చేసి పూర్తిగా విఫ‌లం చెందారు. ఈ నేప‌థ్యంలోనే ఓవైపు వికెట్లు ప‌డుతున్న వేళ‌.. మ‌రోవైపు ఓపెన‌ర్ పాతుమ్ నిసాంక ప‌ట్టుద‌ల‌గా ఆడాడు. 44 బంతులు ఎదుర్కొన్న నిసాంక 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో మొత్తం 68 ప‌రుగులు చేశాడు. నిసాంక హాఫ్ సెంచరీకి తోడు చివ‌ర్లో హ‌స‌రంగా 9 బంతుల్లో 29 నాటౌట్ మెరుపులు మెరిపించ‌డంతో శ్రీలంక గ‌ట్టెక్క గ‌లిగింది.


శ్రీలంక ఫ‌స్ట్ ప్లేయ‌ర్ గా..

శ్రీలంక గెలుపులో కీల‌క పాత్ర పోషించిన పాతుమ్ నిసాంక కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. అంతేకాదు.. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంత‌ర్జాతీయ టీ-20 ఫార్మాట్ లో శ్రీలంక త‌ర‌పున అత్య‌ధిక 50+ ర‌న్స్ చేసిన తొలి ఆట‌గాడిగా నిలిచాడు. ంత‌కు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అత‌ని ఖాతాలో ప‌ద‌హారు 50+ స్కోరు ఉంటే.. నిసాంక తాజాగా అత‌ని రికార్డును బ్రేక్ చేసి 17 చేశాడు. దీంతో తొలి ఆట‌గాడిగా నిసాంక త‌న పేరిట అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు కుశాల్ పెరీరా కూడా 16 సార్లు 50కి పైగా స్కోర్ సాధించి కుశాల్ మెండిస్ తో క‌లిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. వాస్త‌వానికి నిన్న హాంకాంగ్ పై శ్రీలంక ఆట‌గాడు నిసాంక కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌కుంటే.. శ్రీలంక ప‌రువు పోయేదే అని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Related News

BAN Vs AFG : పోరాడి ఓడిన అప్గానిస్తాన్.. సూప‌ర్ 4 లోకి బంగ్లాదేశ్ అడుగు పెట్టిన‌ట్టేనా..?

Glenn Maxwell : ఆస్ట్రేలియా క్రికెట‌ర్ మ్యాక్స్ వెల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Yusuf Pathan : యూసఫ్ పటాన్ కు ఊహించని ఎదురు దెబ్బ… హైకోర్టు కీలక ఆదేశాలు

Shahid Afridi : రాహుల్ గాంధీని మెచ్చుకున్న పాకిస్తాన్ క్రికెటర్.. హిందూ మతం పేరుతో అంటూ !

Robin Uthappa : క్రికెట‌ర్లు రాబిన్ ఉత‌ప్ప‌, యువ‌రాజ్ సింగ్ కు ఈడీ స‌మ‌న్లు.. అత‌నికి కూడా..!

Mohammed Yousuf : సూర్య కుమార్ యాద‌వ్ పై లైవ్ టీవీలో పాక్ మాజీ కెప్టెన్ సెన్షేష‌న్ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంట‌ర్

Team India Sponser : టీమిండియా జెర్సీ కి నూత‌న స్పాన్స‌ర్ ఖ‌రారు.. ఒక్కో మ్యాచ్ కి బీసీసీఐ ఎంత చెల్లించ‌నుందంటే..?

Big Stories

×