Bigg Boss Promo: మామూలుగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన కొన్ని రోజులు తర్వాత గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్లు గొడవ పడటానికి ఎక్కువ టైం పట్టలేదు. ముఖ్యంగా ఈ సీజన్ లో కామనర్స్ కూడా ఉండటం వలన షో కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కేవలం మొదటి వారంలోనే చాలా గొడవలు జరిగిపోయాయి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు.
రెండవ వారం నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది. ఇప్పటికే మనీష్, తనుజ నామినేషన్ చేసేసారు. ఈరోజు కూడా నామినేషన్స్ జరిగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు కారు అని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్లు ముఖానికి రంగు రాసి నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పారు.
అలా ప్రతి కంటెంట్ ఎవరు అర్హులు కారు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ మొఖానికి రంగు రాసి వీళ్ళ రీజన్స్ చెప్తున్నారు. అయితే రీజన్స్ చెప్పే తరుణంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయంటే అరచి అరిచి పోతారేమో అని భయమేస్తుంది.
మాస్క్ మెన్ హరీష్ గేమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన మొదటి రోజు నుంచి తనకే అన్ని విషయాలు తెలుసు అనే విధంగా ప్రవర్తిస్తూ కొన్ని విషయాలు దొరికిపోతున్నాడు. ఈ వారం మాత్రం ఎక్కువ మంది హరీష్ ను టార్గెట్ చేశారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇమ్మానుయేల్ గుండె అంకుల్ ఇష్యూ మెన్షన్ చేస్తూ హరీష్ ను నామినేట్ చేశాడు. అలానే భరణికి హరీష్ కు మధ్య తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది.
హరీష్ బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ తినడం మానేసిన సంగతి తెలిసిందే. ఒక తరుణంలో శ్రీజ దమ్ము ఫుడ్డు పట్టుకుని వెళితే నాకు అవసరం లేదు మీతో ఉండాలని లేదు అనే మొహం మీద చెప్పేశాడు. వెంటనే శ్రీజ దమ్ము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అదే పాయింట్ పట్టుకొని హరీష్ తో బలంగా ఆర్గ్యుమెంట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో ఇవి హైలెట్స్ గా నిలిచాయి.
Also Read : OG Film: సుజీత్ మెంటల్ మాస్ ప్లాన్, ఇక అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే