Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో రెండవ వారం నామినేషన్స్ మొదలైపోయాయి. నామినేషన్ అంటే ఆటోమేటిక్ గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. కారణాలు చెబుతున్న తరుణంలో ఒకరి మీద ఒకరు బీభత్సంగా అరుచుకున్నారు. ఇంతకీ ఎవరెవరిని నామినేషన్ చేశారో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారం నామినేషన్స్ మొదలైపోయాయి. రాము రాథోడ్ తనతో సరిగ్గా ర్యాపో లేదు అని నేను కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాను అంటూ నామినేట్ చేశాడు. వీరిద్దరికి మధ్య లిటిల్ బిట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తరువాత హరీష్ ను నామినేట్ చేశాడు. సెలబ్రిటీ అయిన రాము రాథోడ్ కామనర్స్ కళ్యాణ్, హరీష్ ను నామినేట్ చేశాడు.
ప్రియా శెట్టి ఫ్లోరా ను నామినేట్ చేశారు. మీరు మంచి పాజిటివ్ పర్సన్ చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడటం నాకు ఏదోలా అనిపించింది అంటూ నామినేట్ చేశారు. తరువాత ప్రియా శెట్టి భరణిని నామినేట్ చేసింది. కామనర్ గా వచ్చిన ప్రియశెట్టి ఇద్దరు సెలబ్రిటీలను నామినేట్ చేసింది.
రీతు చౌదరి హరీష్ ను నామినేట్ చేశారు. ఎప్పుడైనా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు. నేను తినను, నేను వెళ్ళిపోతాను, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు అంటుంటారు. అదే అన్నం మీ ముందు గంటన్నర వెయిట్ చేసింది. మీ ఫ్యామిలీ గురించి అయినా మీరు తినాలి కదా. మీరు గివ్ అప్ చేసినందుకు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అలానే ఫ్లోరా గురించి ఒకే ఒక విషయంలో నచ్చకపోవటం వలన నామినేట్ చేశారు. హరీష్ కు రీతుకు మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.
హౌస్ లో ఏ వస్తువు పోయినా పర్టికులర్ గా నన్నే వచ్చి అడుగుతున్నావ్ అనే రీసన్ పైన ప్రియా శెట్టి ను సుమన్ శెట్టి నామినేట్ చేశారు. అలానే హౌస్ లోకి వెళుతున్న ప్రతిసారి వెళ్తారా అని పదేపదే నన్ను నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్న అంటూ మనీష్ ను నామినేట్ చేశాడు సుమన్ శెట్టి.
పవన్ ఫ్లోరాను నామినేట్ చేశారు. తంసప్ ఇష్యూ ని రైజ్ చేశాడు పవన్. భరణిను నామినేట్ చేశారు. ఎగ్ ఇష్యును మళ్లీ బయటకు తీసాడు పవన్.
కెప్టెన్సీ గేమ్ వలన మీ వలన హర్ట్ అయ్యాను అని మనీష్ ను నామినేట్ చేస్తున్నాను అంటూ ఇమ్మానుయేల్ చెప్పాడు. సంచాలక్ గా మీరు కరెక్ట్ గా ఉండకపోవటం వలన నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పేశాడు. మాస్క్ మాన్ హరీష్ ను నామినేట్ చేశారు. వీరిద్దరికి మధ్య బీభత్సమైన గొడవ జరిగింది.
భరణి ప్రియా శెట్టి ను నామినేట్ చేశారు. కుకింగ్ విషయంలో కంప్లైంట్స్ చేశారు. ఈ పాయింట్ మీదే నిన్ను నామినేట్ చేస్తున్న అంటూ క్లారిటీ ఇచ్చారు.
కళ్యాణ్ వచ్చి గుడ్డు విషయాన్ని బయటకు తీస్తూ భరణిని నామినేట్ చేశాడు. అలానే మీరు ఇది కాదు స్ట్రాంగ్ గా ఉండాలి పర్ఫెక్ట్ గా ఆడాలి అంటూ హరీష్ ని నామినేట్ చేశాడు.
ఫ్లోరా సైని తనుజాను నామినేట్ చేశారు. డిమోన్ పవన్ ను నామినేట్ చేశారు. దీనికి కారణంగా ప్రతిసారి సంజనా మేడం గురించి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అంటే చెప్పారు.
హరీష్ మొదట భరణి ను నామినేట్ చేశారు. గుడ్డు ఇష్యూ ను బయటికి తీశారు. తర్వాత ఇమ్మానుయేల్ ని నామినేట్ చేశారు. మళ్లీ వీరిద్దరికీ మధ్య బీభత్సమైన గొడవ జరిగింది. ఇంత గొడవలో కూడా ఇమ్మానుయేల్ కొన్ని మేనరిజమ్స్ ఫన్నీగా అనిపించాయి.
భరణిను నామినేట్ చేసింది శ్రీజ. మీరు మంచి వాడిలా కనిపిస్తారు. కానీ మ్యానుఫ్యులేట్ గేమ్ ఆడుతున్నారు. అంటూ కారణాలు చెప్పి గుడ్డు ఇష్యూను మరోసారి బయటికి తీసింది. తరువాత మాస్క్ మాన్ హరీష్ ను నామినేట్ చేసింది.
ఆల్రెడీ నామినేషన్ లో ఉన్న వాళ్ళని స్పెషల్ గా కెప్టెన్ ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఊహించిన విధంగా సుమన్ శెట్టి ని సంజన నామినేట్ చేశారు. తను ఏడుస్తున్న సిచువేషన్ లో సుమన్ శెట్టి మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదు అని రీజన్ చెప్పారు.
Also Read: Bigg Boss 9 : అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ పంచాయతీ ఇంకా తెగలేదు