BigTV English

Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్

Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్

Bigg Boss 9:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అందులో భాగంగానే రెండవ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా 9వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో నామినేషన్ ప్రక్రియ చూస్తూ ఉంటే చాలామంది కామనర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.. అంతేకాదు నామినేషన్స్ కారణంగా ఒకరికొకరు దూషించుకోవడం చూసేవారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


హీటెక్కిన నామినేషన్స్..

అందులో భాగంగానే తాజాగా 9వ రోజుకి సంబంధించిన మొదటి ప్రోమోని విడుదల చేయగా.. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ ఎక్కినట్లు అనిపిస్తోంది. నామినేషన్స్ లో భాగంగా హరిత హరీష్ ను రాము రాథోడ్ నామినేట్ చేస్తూ .. నేను వెళ్ళిపోతాను రాము.. ఇలా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్న మనుషుల మధ్య ఉండలేను అని డైరెక్ట్ గా హరిత హరీష్ చెప్పేయడం నాకు నచ్చలేదు. అంటూ చెప్పి హరిత హరీష్ ను నామినేట్ చేశారు. ఆ తర్వాత రీతు చౌదరి కూడా హరిత హరీష్ ను నామినేట్ చేస్తూ తన వాదన వినిపించింది. మీకు నచ్చినట్లు ఉండమంటే కుదరదు అంటూ మాస్క్ మాన్ హరీష్ వాయిస్ రైజ్ చేయగా రీతు చౌదరి మాట్లాడుతూ.. మిమ్మల్ని మార్చుకోమని నేను చెప్పట్లేదు అంటూ తెలిపింది.

మాస్క్ మ్యాన్ దెబ్బకు రీతు చౌదరి కన్నీళ్లు..


మా ఇంట్లో గొడవలు రావడానికి కారణం ఓనర్స్ మధ్య నువ్వే కాదు అంటూ రీతూ చౌదరిపై బాంబు పేల్చారు మాస్క్ మ్యాన్. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ మాట్లాడే మాటలకు రీతూ చౌదరి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. నావల్లే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. నాకు ఆకలైతే ఒక ముక్క పెట్టండి అని అడిగి తిన్నానే కానీ మీ అందరి భోజనం లాక్కొని నేను తినలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనితో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ.. ఫిమేల్ సింపతీ ప్లే చేయకండి అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇలా మాస్క్ మ్యాన్ చేసిన కామెంట్లకు రీతు చౌదరి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎలిమినేషన్ తప్పదా?

ఇకపోతే మాస్క్ మ్యాన్ సెలబ్రిటీలే కాదు ఓనర్స్ కూడా నామినేట్ చేశారు. అందులో భాగంగానే ప్రియా శెట్టి కూడా మాస్క్ మ్యాన్ ను నామినేట్ చేయడం జరిగింది. మొత్తానికైతే మాస్క్ మ్యాన్ కి రంగు పడింది అని చెప్పవచ్చు ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ మ్యాన్ ను టార్గెట్ చేస్తూ ఈవారం నామినేట్ చేశారు.మరి కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయనకు ప్రజల ఆదరణ లభిస్తుందా లేక ఈ వారం ఎలిమినేట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

ALSO READ:Tollywood :పడుకుంటేనే అవకాశాలు.. హాట్ బాంబ్ పేల్చిన బద్రి మూవీ హీరోయిన్!

Related News

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 నామినేషన్స్.. అతనే సెకండ్ ఎలిమినేట్..? ఒక్కొక్కరికి షాక్..

Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి

Bigg Boss 9 : వీళ్లు కామనర్స్ కాదు, సెల్ఫిష్ రూతులస్ ఇడియట్స్

Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?

Bigg Boss 9 Promo : ట్విస్ట్ మీద ట్విస్ట్, వరస్ట్ కామనర్స్.. హౌస్‌లో నుండి వెళ్లిపోయే వరకు ఏమి తినను

Bigg Boss 9: ఏడూర్లు వెళ్లి అడుక్కుతింటా కానీ ఆ కొంపలోకి వెళ్ళను.. ఇప్పుడేమో బిగ్ బాస్ లోకి వెళ్తానంటూ!

Bigg Boss 9: నాగ్ తో ఆ పనికి సిద్ధమైన శ్రష్టి.. చెప్పినట్టుగానే వచ్చిందిగా?

Big Stories

×