BAN Vs AFG : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ అబుదాబి వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 154/5 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సైఫ్ హాసన్ 30, తాంజిద్ హసన్ 52, లిట్టన్ దాస్ 02, హృదయ్ 26, షమీమ్ హుసెన్ 11, జాకర్ అలీ 12 నాటౌట్, నూరుల్ హాసన్ 12 పరుగులు నాటౌట్ గా నిలవడంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదన దిగిన అప్గానిస్తాన్ జట్టు తొలి ఓవర్ తొలి బంతికే తొలి వికెట్ కోల్పోయింది. అప్గానిస్తాన్ తొలి 10 ఓవర్లకు 61-3 వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తరువాత వరుసగా ఒక్కొక్కరూ క్యూ కట్టారు.
Also Read : Pathum Nisanka : హిస్టరీ క్రియేట్ చేసిన నిసాంక.. తొలి శ్రీలంక ఆటగాడిగా..
అప్గానిస్తాన్ ఆటగాళ్లు రెహ్మానుల్లా గుర్బాజ్ (35), ఇబ్రాహిం 05, గుల్బాదిన్ 16, మహ్మద్ నబి 15 పరుగులు చేశాడు. ఇక అజ్మతుల్లా ఒమర్ జాయ్ 30 పర్వాలేదనిపించాడు. చివర్లో రషీద్ ఖాన్ విజయతీరాలకు చేర్చుతాడనుకుంటే.. ముస్తఫిజర్ బౌలింగ్ లో తస్కిన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజర్ 3, రషీద్ హోసన్ 2, నసూమ్ అహ్మద్ 2, తస్కిన్ అహ్మద్ 1 చొప్పున వికెట్లు తీశారు. చివరి ఓవర్ లో 6 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండటంతో అప్గానిస్తాన్ జట్టు చేయలేకపోయింది. చివరి ఓవర్ లో 3వ బాల్ నూర్ అహ్మద్ సిక్స్ బాదడంతో అప్గానిస్తాన్ గెలుస్తుందని అంతా ఆశ పడ్డారు. కానీ అప్పటికి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉంది. 5వ బంతిని సిక్స్ గా మలిచాడు. దీంతో ఒక్క బంతికి 9 పరుగులు చేయాల్సి వచ్చింది. నూర్ అహ్మద్ క్యాచ్ ఔట్ కావడంతో 146 పరుగులకే అప్గానిస్తాన్ ఆలౌట్ అయింది.
అప్గానిస్తాన్ జట్టు ఈ మ్యాచ్ లో ఓటమిపాలవ్వడంతో తరువాత శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే అప్గానిస్తాన్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. గ్రూపు-ఏ నుంచి ఇండియా-పాకిస్తాన్ దాదాపు ఖరారు కాగా.. గ్రూపు బీ నుంచి శ్రీలంక ఒక్కటే ఖరారు అయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచినప్పటికీ.. అప్గానిస్తాన్ శ్రీలంక పై విజయం సాధిస్తేనే సూపర్ 4లోకి వెళ్తుంది. లేదంటే బంగ్లాదేశ్ సూపర్ 4లోకి వెళ్తుంది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ గ్రూప్ బీలో రెండో స్థానంలోకి చేరుకుంది. ఒకవేళ తక్కువ రన్స్ తో గెలిచినా అప్గానిస్తాన్.. సూపర్ 4లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే..? తనకు రన్ రేట్ 2 పాయింట్లకు పైగా ఉంది. ఇది అప్గానిస్తాన్ కి కలిసొచ్చే అంశం. శ్రీలంక పై విజయం సాధిస్తేనే అప్గానిస్తాన్ కి అవకాశాలుంటాయి. లేదంటే ఇక ఇంటికి వెళ్లాల్సిందే.