Yusuf Pathan : టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడనే చెప్పవచ్చు. పఠాన్ పిటిషన్ ను తిరస్కరించడం ద్వారా గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. కోర్టు దీనిని విచారించింది. ప్రధానంగా యూసుఫ్ పఠాన్ ఆక్రమించిన భూమి అతనికి చెందినది కాదని.. మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి అని కోర్టు స్పష్టంగా చెబుతోంది. దీంతో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఈ స్థలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూసుఫ్ పఠాన్ టీఎంసీ ఎంపీ.. కోర్టు ఆదేశం తరువాత అతను ఆక్రమించిన స్థలం బుల్డోజర్ చర్యకు గురయ్యే ప్రమాదం ఉంది. 2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో యూసుఫ్ పఠాన్ సభ్యుడు. మాజీ క్రికెటర్ భూమిని ఆక్రమణదారుడిగా గుర్తించబడ్డాడని.. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చట్టం ప్రకారం.. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్వర్వుల్లో పేర్కొంది.
Also Read : Shahid Afridi : రాహుల్ గాంధీని మెచ్చుకున్న పాకిస్తాన్ క్రికెటర్.. హిందూ మతం పేరుతో అంటూ !
2012లో యూసుఫ్ పఠాన్ ఓ స్థిరాస్తి నిర్మించడానికి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఓ ప్లాట్ కోసం అడిగారు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్లాట్ ను వేలం లేకుండా విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. దాని విలువ చదరపు మీటర్ కి రూ.57, 270 గా నిర్ణయించింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆ ప్లాట్ ను పఠాన్ కి కేటాయించాలనే ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ ప్లాట్ చాలా ఏళ్లు పఠాన్ ఆధీనంలోనే ఉండింది. జూన్ 2024లో పఠాన్ వెస్ట్ బెంగాల్ లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సమయంలో ఓ వీఎంసీ కౌన్సిలర్ పఠాన్ ప్లాట్ ను ఆక్రమించడాన్ని వ్యతిరేకించారు. దీంతో వీఎంసీ అతనికి ఆ స్థలాన్ని ఖాలీ చేయమని నోటీసు కూడా జారీ చేసింది. అతను హైకోర్టును కూడా ఆశ్రయించాడు. యూసుఫ్ పఠాన్ ఇల్లు వడోదరలోని తండల్లా ప్రాంతంలో ఉంది. అయితే పఠాన్ ఈ ప్లాట్ ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.
కానీ వీఎంసీ పఠాన్ పిటిషన్ ను వ్యతిరేకించింది. విచారణ తరువాత జస్టిస్ మౌనాభట్.. పఠాన్ పిటిషన్ ను తిరస్కరించారు. కోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఆర్డర్ ప్రకారం.. ప్లాట్ ని ఆక్రమించుకునే హక్కు పిటిషనర్ పఠాన్ కి లేదు. కాబట్టి పిటిషనర్ సంబంధిత భూమిని ఆక్రమించాడనే కార్పొరేషన్ వాదన. ఈ కోర్టు కూడా అలాగే చెబుతోంది. ఎందుకంటే..? పిటిషనర్ కి అనుకూలంగా ఎలాంటి పరిశీలన లేదా కేటాయింపు ఉత్తర్వు లేకుండా పిటిషనర్ సంబంధిత భూమిని ఆక్రమించడం.. అన్యాయం అవుతుంది. ఈ చర్య సరిహద్దు గోడను నిర్మించడం ద్వారా ఆక్రమణకు సమానం అని కోర్టు వెల్లడించింది.