Viral video: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకంది. నైనిటాల్‌లోని ధికులి గ్రామంలో మొరాదాబాద్‌కు చెందిన ఒక పర్యాటకుడు ఓ బాలికను వేధించినందుకు గ్రామస్థులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. నైనిటాల్ లోని ధికులి గ్రామంలోని ఒక దుకాణం వద్ద ఘటన చోటుచేసుకుంది. ఈ పర్యాటకుడు అక్కడ తన మొబైల్ నంబర్‌ను బాలికకు ఇవ్వడానికి ప్రయత్నించాడు. దుకాణదారుడు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి, అతన్ని ప్రశ్నించగా.. ఆ పర్యాటకుడు వారినే తిరగి బెదిరించాడు.
नैनीताल–
रामनगर क्षेत्र में UP के टूरिस्ट की पिटाई। आरोप है कि ये टूरिस्ट रिजॉर्ट के पास दुकान पर सामान लेने गया। वहां बैठी लड़कियों को अपना मोबाइल नंबर दिया। विरोध करने पर उन्हें रिवॉल्वर दिखाई। इस पर लोगों ने इस टूरिस्ट को पकड़ लिया। पिटाई करके पुलिस के हवाले कर दिया। pic.twitter.com/NQACKtKJpO— Sachin Gupta (@SachinGuptaUP) September 15, 2025
ఈ ఘటన గురించి తెలియగానే.. గ్రామ పెద్ద జగదీష్ ఛిమ్వాల్ నేతృత్వంలో స్థానిక గ్రామస్థులు వెంటనే రియార్ట్ అయ్యారు. ఆ పర్యాటకుడు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్థులు అతన్ని అడ్డుకుని, పోలీసులు వచ్చే వరకు అతన్ని బంధించారు. ఈ సంఘటనలో అతన్ని కొట్టడం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుోతంది. ఈ వీడియోను నెటిజన్లు ఎక్కువగా వీక్షించారు. పోలీసులు ఆ పర్యాటకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.. అతని వద్ద ఉన్న రివాల్వర్, బాలికను వేధించిన ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Viral video: దారుణ ఘటన.. భార్యను కట్టేసి.. బెల్టుతో కొడుతూ పైశాచిక ఆనందం..!
ఈ ఘటన స్థానికులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, ఎందుకంటే ఇది ఒక చిన్నారి బాలిక భద్రతకు సంబంధించిన విషయం. ధికులి గ్రామం, నైనిటాల్‌లోని పర్యాటక ప్రాంతంలో ఉండడం వల్ల, ఇలాంటి ఘటనలు స్థానికులు, పర్యాటకుల మధ్య ఉద్రిక్తతలను సృష్టించాయి. పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని, బాధితురాలి భద్రతను కాపాడటంతో పాటు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడం వల్ల, మహిళలు, బాలికల భద్రతపై మరింత చర్చ జరుగుతోంది.
ALSO READ: TGPSC: టీజీపీఎస్సీ ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు.. వారి ప్రధాన డిమాండ్ ఇదే..