Bigg Boss 9:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయింది. ఇందులో 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఏకంగా 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చారు. ఇకపోతే కామనర్స్ ను ఓనర్స్ గా ప్రకటించిన బిగ్ బాస్ సెలబ్రిటీలను టెనెంట్స్ అంటూ డివైడ్ చేసి ఊహించని రేంజ్ లో షో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున ఈ సీజన్ ప్రారంభం కాకముందు “డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్” అంటూ పెద్ద ఎత్తున సీజన్ పై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందులో భాగంగానే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టుగా పోటీ గట్టిగా జరుగుతోంది.
మొదటి వారంలో భాగంగా జానీ మాస్టర్ శిష్యురాలు లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. రెండవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఘనంగా ప్రారంభం అయింది. అందులో భాగంగానే ఇప్పుడు గత రెండు రోజులుగా ఈ నామినేషన్స్ ప్రక్రియ వేడి పుట్టిస్తోంది. అయితే మధ్యలో అందరి మాస్కులు తొలగిపోతున్నాయని చెప్పవచ్చు. తాజాగా 9వ రోజుకి సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.. అందులో కంటెస్టెంట్స్ మధ్య బాడీ షేమింగ్ గొడవలు వచ్చి పెద్ద ఎత్తున షోని మరింత హిట్ ఎక్కిస్తున్నారని చెప్పవచ్చు ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
కామెడీ పండించిన సుమన్ శెట్టి..
నామినేషన్స్ లో భాగంగా సంజన గల్రానీ సుమన్ శెట్టి ని నామినేట్ చేస్తూ.. నేను ఎవరిని పర్సనల్గా తొక్క లేదు అంటూ చెబుతుండగానే సుమన్ శెట్టి దగ్గరకు వస్తూ ఆ రాయి అంటూ ముఖానికి రంగు పూయించుకోవడం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. మీరు అరవకండి అంటూ సంజనా చెబుతుండగా..” రాయండి మేడం టైం లేదు కాళ్లు నొప్పులు పెడుతున్నాయి” అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. మీరు రంగు పూస్తే రాయించుకుంటాను అంటూ సుమన్ శెట్టి కామెడీ పండించే ప్రయత్నం చేయగా.. మీరు కామెడీ చేస్తే ఇక్కడ నడవదు అంటూ ఆమె సీరియస్ అయింది. అలాగే ఓనర్స్ హౌస్ లోకి సుమన్ శెట్టి ఎంట్రీ అవడంపై మనీష్ అభ్యంతరం వ్యక్తం చేశారని
.. ఇప్పుడు ఇదే విషయంపై నామినేట్ చేయగా.. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియాలి కదా అంటూ మనీష్ చెబితే.. మేమేం దొంగలు కాదు కదా బాబాయ్ అంటూ సుమన్ శెట్టి కామెంట్లు చేశారు.
ALSO READ:Priyanka mohan: డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఊహించని కామెంట్స్ చేసిన ప్రియాంక!
భోజనం విషయంలో గొడవ..
భోజనం విషయంలో ప్రియా శెట్టి, భరణి శంకర్ మధ్య కూడా కాస్త వేడిగా సంభాషణ జరిగింది. భరణి శంకర్ ప్రియా ప్రొఫెషన్ను బయటకు తీస్తూ మాట్లాడగా ప్రియా శెట్టి తట్టుకోలేకపోయింది. దాంతో మరింత గట్టిగా అరిచేసింది. అలాగే ఇమ్మానుయేల్ మాస్క్ మాన్ హరీష్ మధ్య కూడా గట్టిగానే వాదన జరిగినట్టు మనం ఈ ప్రోమోలో చూడవచ్చు. ఏది ఏమైనా బాడీ షేమింగ్ చేసుకొని ఇక్కడ మాట్లాడిన మాటలకు వారం చివరిలో నాగార్జున చేత తిట్లు తినక తప్పదు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.