Glenn Maxwell : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ ఏడాది జూన్ లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్ననట్టు సమాచారం. రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే మ్యాక్స్ వెల్ దేశవాలీ వన్డేలు కూడా ఆడటం లేదు. వాటిలో ముఖ్యంగా లిస్ట్ ఏ, 50 ఓవర్ల ఫార్మాట్ కి ఆడలేదు మ్యాక్స్ వెల్. కానీ 50 ఓవర్ల ఫార్మాట్ లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరపున బరిలోకి దిగబోతున్నాడు మ్యాక్స్ వెల్.
Also Read : Yusuf Pathan : యూసఫ్ పటాన్ కు ఊహించని ఎదురు దెబ్బ… హైకోర్టు కీలక ఆదేశాలు
దేశవాళీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరపున బరిలోకి దిగబోతున్నాడు మ్యాక్స్ వెల్. ఇతను 2022 తరువాత కేవలం ఒకే ఒక్క లిస్ట్-ఏ మ్యాచ్ ని ఆడాడు. త్వరలో న్యూజిలాండ్ తో జరగబోయే టీ-20 సిరీస్ కిముందు ఫిట్ నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో సెప్టెంబర్ 17న క్వీన్స్ లాండ్ తో, సెప్టెంబర్ 19నటస్మానియాతో జరుగబోయే మ్యాచ్ ల్లో ఆడనున్నాడు. ఇక మ్యాక్స్ వెల్ జట్టులో మ్యాట్ షార్ట్, మార్కస్ హ్యారిస్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, విల్ సదర్ ల్యాండ్ వంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా గత సీజన్ లో ఫైనల్ కి చేరినప్పటికీ రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఈసారి మ్యాక్స్ వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్ లో విక్టోరియా తరపున బరిలోకి దిగుతుండటం.. ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఇటీవలి కాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్ ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్ లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో (0/15/(2), 62 నాటౌట్ ఆకట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మరోవైపు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 01 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే టీమిండియా వర్సెస్ వెస్టీండిస్ మధ్య కూడా టెస్ట్ సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియా జట్టు 3 టీ-20లు ఆడుతుంది. అక్టోబర్ 01, 03, 04 తేదీల్లో మౌంట్ మాంగనౌయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్ లు జరుగుతాయి. న్యూజిలాండ్ పర్యటన అనంతం ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో టెస్ట్ సిరీస్ లో పాల్గొననుంది. అలాగే వెస్టిండీస్ అనంతరం ఆస్ట్రేలియాతో సటెస్ట్ సిరీస్ లో పాల్గొననుంది. 2025లో అటు ఆస్ట్రేలియా జట్టు.. టీమిండియా జట్టు పుల్ బిజీగా ఉండనుంది. ప్రస్తుతం ఆసియా కప్ లో ఉన్న టీమిండియా సెప్టెంబర్ 28న ఫైనల్ తో ముగుస్తుంది ఆసియా కప్. ఈ కప్ ముగిసిపోగానే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో పాల్గొననుంది టీమిండియా జట్టు.