BCCI : ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రికెట్ ఒక క్రీడ మాత్రమే కాదు.. ఇదొక పెద్ద వ్యాపారం అని గర్వంగా చెప్పవచ్చు. ఇందులో పలు దేశాల క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. వాటిలో టీమిండియా క్రికెట్ బోర్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, పలు ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నాయి. గత పది సంవత్సరాల నుంచి ఇది అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఇండియాలో అయితే ఐపీఎల్ వంటి క్రికెట్ లీగ్ ల ద్వారా బీసీసీఐ రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే..? క్రికెట్ బోర్డు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేంతగా మారిపోయింది. ఇందుకు ప్రధాన ఉదాహరణ బీసీసీఐ అని సగర్వంగా చెప్పవచ్చు.
Also Read : Pakisthan Blast : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన
సాధారణంగా క్రికెట్ లో టీమిండియా అంటే.. ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండే విషయం అందరికీ తెలిసిందే. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంటే ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు అని చెప్పవచ్చు. బీసీసీఐ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? 2019లో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6059 కోట్లు కాగా.. 2025 ప్రస్తుతం వరకు రూ.20680 కోట్లకు చేరుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కేవలం 6 సంవత్సరాల్లోనే ట్రిపుల్ కంటే కాస్త ఎక్కువ పెరగడంతో షాక్ అవుతున్నారు.ఆరేళ్లలో 14,627 కోట్లు సంపాదించడం విశేషం. ఇక బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడంతో ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాసిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ బీసీసీఐ దశ, దిశనే మార్చేసిందని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు కూడా ఇంత రిచ్ కాదు అని నెటిజన్లు చర్చించుకోవడం విశేషం. ఇంత తక్కువ సమయంలో బీసీసీఐ ఇంత రిచ్ గా కావడానికి కారణాలు ఏంటి..? అని ప్రశ్నలు సంధించుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే..? అయితే అత్యంత పేద క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే..? న్యూజిలాండ్ అని చెప్పవచ్చు. టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ పేద క్రికెట్ బోర్డుగా ఉంది. వాస్తవానికి న్యూజిలాండ్ 1926 నుంచి క్రికెట్ ఆడుతుంది.
మరోవైపు ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి స్థానం నుంచి రోజర్ బిన్నీ ఇటీవలే వైదొలిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అతని వయస్సు 70 సంవత్సరాలు దాటడంతో అతను భారత రాజ్యాంగం ప్రకారం.. బీసీసీఐ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఉపాధ్యక్షుడుగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు అక్టోబర్ 18న ఎన్నికలు జరపాలని బీసీసీఐ తీర్మాణించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శితో పాటు కోశాధికారి ఎంపిక కోసం ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కొత్త అధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్ ఎన్నుకోవడమే ప్రధాన అజెండాగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ఈనెల 28న ముంబైలో జరుగనుంది. ముంబైలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ నెల ఉదయం 11.30 గంటలకు బీసీసీఐ కార్యవర్గం సమావేశం జరుగనున్నట్టు సమాచారం. మరోవైపు సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.