E-Paper
Advertisement

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..
Advertisement

Agnipariksha 2 : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈయడాది పదో సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఈ సీజన్లో ఎలాంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ తీసుకురా పోతుంది అంటూ ఇప్పటినుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ 10 గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. తొమ్మిదవ సీజన్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. అందుకు కారణం అగ్ని పరీక్ష. ఈ షో ని నిర్వహించి సామాన్యులను హౌస్ లోకి పంపించడమే సీజన్ హిట్ అవ్వడానికి కారణం అని ఇప్పటికే జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు అగ్ని పరీక్షను నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించనున్నారని తెలుస్తుంది. మరి అగ్నిపరీక్ష 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ షో గురించి కాస్త వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అగ్నిపరీక్ష 2 అప్పుడే..? 

బిగ్ బాస్ ఫాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. అగ్నిపరీక్ష 2 జూన్ నెలాకరున ప్రారంభం కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నెలలో ‘అగ్ని పరీక్ష 2’ కి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా చేయబోతున్నారట. గత సీజన్తో పోలిస్తే ఈసారి సీజన్ ఇంకాస్త కఠినంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. జడ్జీలుగా ఈసారి వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. గత సీజన్ లో వచ్చిన నవదీప్ కొనసాగే అవకాశం ఉందట. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా కూడా ఈ షోలో పాల్గొన్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. త్వరలోనే అగ్నిపరీక్ష సీజన్ 2 గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఇందులో పాల్గొని కంటెస్టెంట్ల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. మరి ఈ సీజన్ లో ఎవరు పాల్గొంటున్నారు? ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే ఇంకొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

 జడ్జిగా మంగపతి..

Advertisement

బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు. తమకి ఇష్టమైన యాక్టర్స్ హౌస్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని జనాలు ఎంతో ఆత్రుతగా ఈ షో ని వీక్షిస్తూ ఉంటారు. వందరోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో ప్రారంభమయ్యే ఈ షో చివరికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లతో ముగుస్తుంది. కంటెస్టెంట్ల మధ్య పెట్టే టాస్కులు జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే అగ్నిపరీక్ష షో ద్వారా సెలెక్ట్ అయినా కంటెస్టెంట్లని హౌస్ లోకి తీసుకుంటున్నారు. గత సీజన్ కు జడ్జిలుగా బిందు మాధవి, హీరో నవదీప్, అలాగే అభిజిత్ ఉన్నారు. కానీ ఈ సీజన్ కి టాస్కులు కఠినంగా ఉండడంతో జడ్జీలను కూడా కాస్త రఫ్ గా ఉండే వాళ్ళని తీసుకోవాలని ఈ యాజమాన్యం భావిస్తుందట. ఈ క్రమంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న హీరో శివాజీని జడ్జిగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సీజన్ మాత్రం మామూలుగా ఉండదని తెలుస్తుంది. మరి సీజన్ 10 లో ఎలాంటి సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారో అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×