RJ Shekar Basha: ఆర్జే శేఖర్ భాషా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆర్జేగా అతని వాయిస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. ఆర్జే గానే కాకుండా యాంకర్ గా కూడా ఎన్నో మంచి షోస్ నిర్వహించిన శేఖర్ భాషా చాలా గ్యాప్ తరువాత రాజ్ తరుణ్ వివాదంలో వేలుపెట్టి ఫేమస్ అయ్యాడు.
రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారంలో లావణ్యదే తప్పు అని, రాజ్ తరుణ్ ఆస్తికోసం మాత్రమే ఆమె ఈ వివాదాన్ని లేవనెత్తిందని శేఖర్ భాషా ఆరోపించాడు. అలా లావణ్య- శేఖర్ భాషా డిబేట్ లో ఆమె చేత చెప్పు దెబ్బ కూడా తిన్నాడు. ఇక ఈ వివాదం వల్ల వచ్చిన పేరుతో బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
రెండు వారాలుగా శేఖర్ భాషా అక్కడ కూడా తనదైన ఆటతీరుతో మెప్పిస్తున్నాడు. ఇంకోపక్క చెత్త జోకులతో మిగతా కంటెస్టెంట్స్ ను కూడా విసిగిస్తున్నాడు కూడా. ఇక ఈరోజు శనివారం.. నాగార్జున.. హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. శేఖర్ భాషాకు గుడ్ న్యూస్ తెలిపాడు. శేఖర్ భాషా తండ్రి అయ్యినట్లు తెలిపాడు. అతని భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుపడంతో హౌస్ లో ఆనందాలు వెల్లివిరిశాయి. శేఖర్ కు హౌస్ మేట్స్ శుభాకాంక్షలు తెలిపారు.
Raghava Lawrence: దెయ్యాలను వదిలేసి రీమేక్ లు ఎందుకు బ్రో..?
బిగ్ బాస్ కు వెళ్ళకముందు ఒక ఇంటర్వ్యూలో శేఖర్ భాషా తన భార్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ” 9 నెలల నిండు గర్భిణీని ఒక్కదాన్నే వదిలేసి వెళ్తున్నాను. కానీ, నాకు తప్పలేదు. ఎందుకంటే ఇది నా భార్య కోరిక. వచ్చే ఏడాది వెళ్తాను అని చెప్పినా కూడా లేదు, మీరు ఈసారే వెళ్ళాలి అని నన్ను బలవంతపెట్టి పంపిస్తుంది. ఇలాంటి సమయంలో పక్కన ఉండకుండా మూడు నెలలు వెళ్తున్నా అని నాకు బాధగా ఉన్నా.. నిండు చూలాలు కోరిక తీర్చడానికి వెళ్తున్నా” అని చెప్పుకొచ్చాడు. ఇక విమర్శలు అన్ని పక్కన పెట్టి.. నెటిజన్స్ సైతం శేఖర్ భాషా తండ్రి అయ్యినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ఈ వారం హూసు నుంచి ఎవరు వెళ్తారు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.