Raghava Lawrence: కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారాడు రాఘవ లారెన్స్. తమిళ్, తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్, నిర్మాత.. ఇలా ఒకటని కాదు.. అన్నింటిలో తన సత్తా చాటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆయన సేవా గుణానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లారెన్స్ ముఖ్యంగా దెయ్యం సినిమాలు.. అదేనండీ హర్రర్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.
ముని, కాంచన, గంగ, కాంచన 3.. ఇలా వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న లారెన్స్ చివరగా హిందీలో కాంచనను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఈ మధ్యనే చంద్రముఖి 2 కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇవన్నీ పక్కన పెడితే కాంచన 4 ను రాఘవ లైన్లో పెడుతున్నాడని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే లారెన్స్ తన పంథా మార్చి కొత్త సినిమాను అనౌన్స్ చేయడం ఆశ్చర్యంగా మారింది.
Aay: బాలయ్య ఫ్యాన్ ను కుక్కను కొట్టినట్లు కొట్టిన చిరు ఫ్యాన్..
రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను స్టూడియోస్ LLP మరియు నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. బిగ్ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా తెరక్కనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ..రాఘవ లారెన్స్ 25 వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కడం.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఈ మధ్య బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిల్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. లక్ష్య, రాఘవ్ జుయల్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ ఛాయా, తాన్య మానిక్తల మరియు అభిషేక్ చౌహాన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించగా ధర్మ ప్రొడక్షన్స్ మరియు సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌పై కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా మరియు అచిన్ జైన్ నిర్మించారు.
Ketika Sharma: అబ్బ.. చీరలో కేతిక ఏముంది గురూ, సొగసు చూడతరమా
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 5 న రిలీజ్ అయ్యి భారీ విజయంను అందుకుంది. ఒక రాత్రి ట్రైన్ లో పడిన దొంగలతో పోరాటం చేసి ప్రయాణికులను కాపాడిన హీరో కథనే కిల్. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి సినిమాను లారెన్స్ రీమేక్ చేయడం కొంతమందికి నచ్చలేదు అనే చెప్పాలి. దెయ్యాలను వదిలేసి రీమేక్ లు ఎందుకు బ్రో.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో లారెన్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.