Bigg Boss 9 Day 53 Promo 4: ప్రస్తుతం హౌజ్లో భరణి, శ్రీజలు రీఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరిలో ఒక్కరు మాత్రమే పర్మినెంట్ హౌజ్‌మేట్ అవుతున్నారు. అలా అవ్వాలంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో వాళ్లు విన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో వారికి వివిధమైన టాస్క్లు ఇస్తున్నాడు. అయితే వారి పెట్టిన టాస్క్లో వారు కాకుండ హౌజ్‌మేట్స్ ఆడాలి. ఒక్కొక్కొ రౌండ్లో ఒక్కొక్క ఇంటి సభ్యుడు వారి తరుపున టాస్క్ ఆడాలి. రెండు రోజులుగా ఈ టాస్క్లే జరుగుతున్నాయి.
ఈ రోజు బిగ్ బాస్ 53వ రోజుకి చేరుకుంది. నేటి ఎపిసోడ్ కి సంబంధించి బిగ్ బాస్ వరుస ప్రొమోలు వదులుతున్నాడు. అయితే ఈ రోజు ఎపిసోడోకి సంబంధించి నాలుగో ప్రొమోను తాజాగా విడుదల చేశారు. మూడో ప్రొమోలో రిలీజ్ ద వారియర్ పేరుతో పెట్టిన టాస్క్ని చూపించాడు. రీఎంట్రీలను జైల్లోపెట్టి వారికి పజిల్ పెట్టారు. అయితే పజిల్ పూర్తి చేయాలంటే బయటకు ఉన్న ఈ బ్లాక్ లను వారి మద్దతు ఇచ్చే కంటెస్టెంట్స్ వెళ్లి ఇవ్వాలి. అయితే దీనికి అమర్చిన టన్నెల్ నుంచి వెళ్లి ఇవ్వాలి. ఈ టాస్క్లో భరణికి రాము, శ్రీజకి కళ్యాణ్ సపోర్టు చేశాడు. తాజాగా విడుదలైన నాలుగో ప్రొమోలో భరణి, శ్రీజల కోసం బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు.
రైట్ కలర్.. రైట్ పోజిషన్ టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం వారికి డిఫరెంట్ కలర్ పైపులు ఇచ్చాడు. వాటిని ప్లాజ్మాలో చూపించిన కలర్ ప్యాటర్న్ చూసి అందులో నెంబర్ ఆధారంగా బయట అమర్చిన పైప్ని లైన్ని అమర్చాలి. ఈ టాస్క్లో భరణికి కోసం ఇమ్మాన్యుయేల్, శ్రీజ కోసం కళ్యాణ్ టాస్క్లో పాల్గొన్నాడు. ఎంతో ఆసక్తిగా జరిగిన ఈ పోరులో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ పోటా పోటిగా ఆడి ఉత్కంఠ పెంచారు. ఆ పైప్ లైన్ అమరస్తున్న క్రమంలో కళ్యాణ్కి అమర్చిన పైప్స్ అన్ని ఊడిపోయినట్టు ప్రొమోలో చూపించారు. కానీ, టాస్క్లో గెలిచింది ఎవరనేది మాత్రం చూపించలేదు. ప్రస్తుతం ఈ నాలుగో ప్రొమో ఆసక్తి పెంచుతుంది. కాగా రీఎంట్రీల కోసం పెట్టిన వివిధ టాస్క్ల్లో ఎక్కువ భరణి గెలిచి లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పర్మినెంట్ హౌజ్ మెంబర్ ఎవరవుతారనేది నేటి ఎపిసోడ్తో క్లారిటీ రాబోతోంది.
కాగా నామినేషన్స్ కోసం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వారి నామినేషన్స్ బట్టి వారిలో ఇద్దరిని సెలక్ట్ చేసి ఒకరిని పర్మినెంట్ హౌజ్ మెంబర్ గా హౌజ్ లోకి రప్పించాడు బిగ్ బాస్. దీంతో శ్రీజ, భరణిలను సెలక్ట్ చేసి వారికి వివిధ టాస్క్ లు పెట్టాడు. ఇందులో హౌజ్ మెంబర్స్ సపోర్టుతో వారు గెలివాల్సి ఉంది. వార్ వారిద్దరి మధ్య అయితే ఆడేది మాత్రం ఇంటి సభ్యులు. ఈ క్రమంలో నిన్న జరిగిన కట్టు.. పడగొట్టు టాస్క్ లో తోపులాట జరిగి భరణి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం భరణి హౌజ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Bharani Shankar Assets: బిగ్ బాస్ భరణి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?