Bigg Boss Bharani : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటుల జీవితాలు మారిపోయాయి. ఎన్నో ఆశలతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. గతంలో ఎంతోమంది బిగ్ బాస్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో నటించి తర్వాత సీరియల్స్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ లో పాల్గొంటూ తమ క్రేజ్ ను పెంచుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లో ఫైర్ బ్రాండ్ గా ప్రేక్షకులను అలరించిన భరణి బాహుబలి సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న భరణి కొన్ని వారాలకి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. ఈయన నటించిన సినిమాలు సీరియల్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.. నటుడిగా తెలుగు ప్రేక్షకులం హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు భరణి శంకర్. తాజాగా బాహుబలి ఆడిషన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ బాహుబలి ఆడిషన్ కి నేను వెళ్ళాను. నాకు ఒక రెండు పేజీలు తెలుగు తమిళ డైలాగ్ లు ఇచ్చారు. రాజమౌళి గారికి నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయనను నన్ను పలకరించిన విధానం నాలోని భయాన్ని పోగొట్టింది. ఆ తర్వాత పది నిమిషాలు ప్రిపేర్ అయ్యి ఆ డైలాగ్ ని చెప్పడానికి ఆడిషన్ రూమ్ లోకి వెళ్లాను. డైలాగ్ చెప్పగానే ఆడిషన్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావు మేనేజర్ దగ్గర చెక్కు తీసుకొని రాజమౌళి గారు అన్నారు. ఈ రోజుల్లో ఎవరు ఆడిషన్ కే పుల్ అమౌంట్ ఇస్తున్నారు..? రాజమౌళి గారికి నా మీద ఉన్న నమ్మకంతో నాకు రెమ్యూనరేషన్ ని ముందే ఇచ్చేశాడు. నిజంగా ఆయన గ్రేట్ అంటూ భరణి ప్రశంసలు కురిపించారు.. బాహుబలి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మళ్లీ బాహుబలి ది పిక్ పేరుతో మరోసారి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు..
Also Read : బిగ్ బాస్ 9 లో టాప్ 5 ఎవరున్నారు..? ఈ వారం ఎలిమినేట్ అతనే..?
బుల్లితెర నటుడు భరణి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారు. అందులో కొన్ని సినిమాలు మంచి గుర్తింపుని అందించాయి. ఈయన 2003లో తొలుత బుల్లితెరపై అడుగుపెట్టి.. తన ఇంటి పేరునే తన పేరుగా మార్చుకున్నాడు.. దాదాపు 30కి పైగా సీరియల్స్‌లో భరణి శంకర్ నటించారు. సీతామహాలక్ష్మీ, తరంగాలు, కుంకుమ రేఖ, పున్నాగ వంటి సీరియల్స్ ఆయనకు మహిళా ప్రేక్షకుల్లో మంచి పేరు తీసుకొచ్చాయి.. కామెడీ పాత్రల్లో కూడా నటించాడు.. రీసెంట్గా తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్నాడు.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి..