Ramya Moksha About Health Issue: పచ్చళ్ల పాప రమ్య మోక్ష రెండు వారాలకే బిగ్ బాస్ హౌజ్‌ని వీడింది. వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండో వారంకే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. దీని కారణం ఆమె తనూజని టార్గెట్ చేయడమే. హౌజ్లోకి వచ్చిరాగానే డిమోన్కి రీతూ జన్యున్ కాదని ఎక్కించింది. మరోవైపు తనూజ, కళ్యాణ్లపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడని, తనూజ కూడా కళ్యాణ్ చేతులు వేస్తే వేయించుకుంటుందంటూ మాధురితో కలిసి బ్యాడ్గా మాట్లాడింది. దీంతో తనూజ, కళ్యాణ్ సపోర్టర్స్ నుంచి ఆమెకు ఫుల్ నెగిటివిటీ వస్తోంది.
నామినేషన్లో తనూజపై చేసిన కామెంట్స్ కూడా ఆమెకు ఫుల్ నెగిటివ్ అయ్యింది. నిజానికి రమ్య మోక్ష.. వివాదంలో వైరల్ అయ్యింది. తన సోదరి అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ వివాదంతో రమ్య మోక్ష పేరు మారుమ్రోగుతుంది. తమ పిక్కిల్క్ రేట్ ఎక్కువ ఉందని, క్వాలిటీ కూడా లేదంటూ కస్టమర్ ఇచ్చిన రివ్యూ.. తన సోదరి రియాక్ట్ అయిన తీరు వివాదంగా మారింది. పిక్కిల్స్ కూడా కొనలేని వాడిని భార్యని ఎలా పోషిస్తావని, కెరీర్పై ఫోకస్ పెట్టాలంటూ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ పిక్కిల్స్ సిస్టర్స్ తీవ్ర నెగిటివిటీ కూడా వచ్చింది.
ఇక రమ్య మోక్ష అప్పటి నుంచి జిమ్ వీడియో చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇందులో ఆమె లుక్ చూసి నెటిజన్స్ ఫిదా అయ్యారు. కానీ, హౌజ్లోకి ఆమె అసలు రూపం చూసి అంతా షాక్ అయ్యారు. వీడియోలో ఫిల్టర్స్ పెట్టి అందరి మోసం చేసిందని, ఆమె అసలు ఫేస్ చూసి అంటున్నారు. తనపై వస్తున్న ట్రోల్స్పై తాజాగా రమ్య మోక్ష స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ లో వరుసగా ఇన్స్టా స్టోరీలో స్టేటస్ పెట్టింది. నా లుక్‌పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ చూశాను. నా డైట్ ప్లాన్ స్కిప్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నాకు థైరాయిడ్ సమస్య కూడా ఉంది. హైదరాబాద్ వచ్చాక ఆ సమస్య మరింత తీవ్రమైంది. వాటర్ పడక ట్రాన్సిస్ వచ్చాయి. దానివల్లే నా ఫేస్ ఉబ్బినట్టు కనిపిస్తోంది.
Also Read: Bharani Shankar Assets: బిగ్ బాస్ భరణి మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
కావాలంటే నా ఎలిమినేషన్ వీడియో చూడండి. అక్కడ నా ముఖంగా ఉబ్బినట్టు ఉంటుంది. థైరాయిడ్, టాన్సిస్ వల్లే నా ఫేస్ స్వేల్లింగ్ వచ్చిన లావుగా కనిపించాను. నిజానికి నేను సన్నగానే ఉంటాను. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ర్యాషెస్ అన్ని తగ్గి ఇప్పుడే నార్మల్ అవుతున్నాను. నిజానికి హైదరాబాద్ రాగానే స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తింది. హైదరాబాద్ నీళ్లు పడక నా చేతులు, నెక్‌తో పాటు శరీమంత ర్యాషెస్ వచ్చాయి. జంక్ ఫుడ్ పడక జ్వరం, డయోరియాతో బాధపడ్డాను. కానీ, బిగ్ బాస్ లో అవేవి చూపించలేదు. అసలు బిగ్ బాస్ హౌజ్ లో ఏం జరిగిందో వీడియో చేసి మీకు చెప్తాను అని స్టోరీలో రాసుకొచ్చింది.