Bigg Boss Bharani Assets and Family Details: బిగ్ బాస్ ఫేం, నటుడు భరణి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్గా వచ్చిన ఆయన ఆరు వారాల పాటు హౌజ్లో కొనసాగాడు. టాప్ కంటెస్టెంట్గా వచ్చిన ఆయన ఎలిమినేషన్ అందరికి షాకిచ్చింది. హౌజ్లో అందరితో కలిసిపోతు పెద్దన్నగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తనూజ, దివ్యలతో నాన్న అని పిలుచుకుంటూ బంధాలకు బానిసయ్యాడు. హోస్ట్ నాగార్జున అటాజ్మెంట్స్ పక్కన పెట్టి ఆట ఆడాలని సూచించిన తీరు మార్చుకోలేదు. అవే బంధాలతో తన ఆటని కూడా త్యాగం చేశాడు. చివరికి ఆరో వారంలో హౌజ్ని విడాడు. ఇక ఇప్పుడు ఆయన హౌజ్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్కు ముందే భరణికి మంచి గుర్తింపు ఉంది. సీరియల్స్ ద్వారా ఆయన ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. చిలసౌ స్రవంతి, మహాలక్ష్మి వంటి సీరియల్స్ విలన్ పాత్రల్లో కనిపించాడు. బుల్లితెరపై భరణి విలనిజం మంచి గుర్తింపు పొందాడు. దాదాసు 30పైగా సీరియల్లో నటించిన ఆయన సినిమాల్లో కామెడీ, విలన్ రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. భాగ్యరేఖ, త్రిశూలం వంటి సీరియల్లో తండ్రి పాత్రల్లోనూ కనిపించి మెప్పించాడు. బుల్లితెరపై విలన్గా, హీరోగా, తండ్రిగా ఇలా విభిన్న పాత్రల్లో కనిపించిన భరణి తనదైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో బుల్లితెర ఆడియన్స్కి మరింత దగ్గరయ్యాడు.
సీరియల్స్లో విలన్గా కనిపించిన భరణి.. బిగ్ బాస్‌లో తన ఆటలో ఎంతటి వైల్డ్ చూపిస్తాడని అంత అనుకున్నారు. కానీ, హౌజ్లో అందరితో కలిసిపోతూ పెద్దన్న అని పిలుపించుకున్నాడు. టాస్క్లు పెద్దగా ఆడకపోయినా ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు. ఆరో వారంలో ఎలిమినేట్ అయిన భరణి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. భరణి నటుడిగా మాత్రమే అందరికి సుపరిచితం. అలాంటియ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆయనకు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మాత్రమే తెలుసు కానీ, వారు ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలోనూ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలేవి లేవి.
Also Read: Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?
దీని బట్టి చూస్తుంటే ఆయన పర్సనల్ లైఫ్ ని ఎంత ప్రైవేట్గా మెయింటెన్ చేశారో అర్థమైపోతుంది. అలాగే సీరియల్స్, సినిమాల ద్వారా భరణి ఎంత సంపాదించాడో కూడా ఆరా తీస్తున్నారు. సుమారు 30 సీరియల్లో నటించిన భరణి రోజుకి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు తీసుకున్నాడట. సినిమాల్లో పాత్ర ప్రాధాన్యతను బట్టి పారితోషికం ఉంటుంది. ఇప్పటి వరకు హయ్యేస్ట్ ఆయన రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకున్నాడు. ఇక బిగ్ బాస్‌లో టాప్ కంటెస్టెంట్గా వచ్చిన భరణి ఒక్కొవారానికి రూ. 3.5 లక్షలు తీసుకున్నాడట. అలా ఆరు వారాకలు రూ. 21 లక్షలు అందుకున్నట్టు తెలుస్తోంది. అతడి మొత్తం ఆస్తుల విలువ (Bharani Net Worth) రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లు అని సమాచారం.