E-Paper
Advertisement

Bigg Boss Priya Shetty : బిగ్ బాస్ లో నన్ను బ్యాడ్ చేశారు.. ఆ ఒక్కటే నేను చేసిన తప్పు…

Bigg Boss Priya Shetty : బిగ్ బాస్ లో నన్ను బ్యాడ్ చేశారు.. ఆ ఒక్కటే నేను చేసిన తప్పు…
Advertisement

Bigg Boss Priya Shetty : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లో పూర్తి చేసుకుంది.. అయితే ఈ షో గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. దానికి తోడు ఇటీవల చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నారు.. బిగ్ బాస్ లో జరుగుతున్న కొన్ని నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారు. తాజాగా మరో కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటుగా.. ప్రస్తుతం తాను ఏం చేస్తున్నది అన్న విషయాల గురించి కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. బిగ్ బాస్ గురించి ప్రియా శెట్టి ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..

హౌస్ లో నన్ను టార్గెట్ చేశారు..

బిగ్ బాస్ షో కి ఎంతోమంది వెళ్లాలని ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.. కొంతమంది ఆ షోకి సంబంధించిన ఆఫర్స్ వస్తూ ఉండడంతో అందులోకి వెళితే క్రేజ్ కూడా పెరుగుతుందని వచ్చేస్తారు. ఒకప్పుడు బిగ్ బాస్ లోకి రావడానికి ఎంతో మంది ఆతృత కనపరుస్తూ ఎన్నో ఆశలతో వచ్చేవారు.. 8 సీజన్ల వరకు ఈ హౌస్ గురించి పాజిటివ్ రెస్పాన్స్ ఏ వచ్చింది. కానీ 9వ సీజన్ తర్వాత బిగ్ బాస్గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హౌస్ లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్లు తమకి అన్యాయం జరిగింది అంటూ యూట్యూబ్ ఛానల్స్ లో బయట పెడుతున్నారు.. తాజాగా ప్రియా శెట్టి యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.. తాను ఏదైతే తప్పు అని వాదించిన దాన్ని చూపించలేదు.. నన్ను విలన్ ను చేశారు.. అందరు టార్గెట్ చేసి బయటకు పంపినట్లు ఆమె చెప్పింది..

సినిమాల్లో నటించాలని కోరిక…

Advertisement

బిగ్ బాస్ లో కంటెంట్ గా పాల్గొన్న ప్రియా శెట్టి అగ్ని పరీక్షలు సెలెక్ట్ అయ్యి హౌస్ లోకి ఎంటర్ అయింది.. అయితే ఈమె మొదటనుంచి టఫ్ కంటెంట్ గాని ఉంది.. కంటెస్టెంట్లకు కౌంటర్ లిస్టు తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళింది. కానీ తక్కువ ఓటింగ్ నమోదవడంతో హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.. అయితే ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెకు సినిమాల్లోకి వెళ్లాలన్నా కోరిక ఉన్నట్లు బయట పెట్టింది.. అంతేకాదు ఇప్పుడు ఆమె తరుణ్ భాస్కర్ కి సంబంధించిన ఓ వెబ్ సిరీస్ లో నటించిన విషయాన్ని కూడా బయటపెట్టింది.. త్వరలోనే దాని గురించి చెప్తానని చెప్పింది.. ప్రస్తుతం ప్రియా ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×