E-Paper
Advertisement

Bigg Boss 9 Tamil: టైటిల్ విజేతగా లేడీ టైగర్.. ట్రోఫీతో పాటూ ప్రైజ్ మనీ ఎంతంటే?

Bigg Boss 9 Tamil: టైటిల్ విజేతగా లేడీ టైగర్.. ట్రోఫీతో పాటూ ప్రైజ్ మనీ ఎంతంటే?
Advertisement

Bigg Boss 9 Tamil: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు ప్రతి భాషలో వరుస సీజన్లు ప్రసారమవుతూ.. ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇప్పటికే హిందీలో 19 సీజన్లు పూర్తి కాగా.. ఇక్కడ తెలుగులో 9 సీజన్ లు పూర్తయ్యాయి. అటు నిన్నటితో తమిళ్లో కూడా తొమ్మిది సీజన్లు పూర్తి కావడం గమనార్హం. ఇకపోతే బిగ్బాస్ చరిత్రలో తెలుగు భాషలో ఇప్పటివరకు లేడీ విన్నర్ కాలేదు అనేది వాస్తవం. నిజానికి ఈసారి తెలుగు సీజన్ 9లో తనూజ టైటిల్ విజేతవుతుందని మొదటి నుంచి అనుకున్నారు. కానీ చివర్లో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. అటు కేవలం బిగ్ బాస్ ఓటీటీ లో మాత్రమే తెలుగులో హీరోయిన్ బిందు మాధవి టైటిల్ గెలిచి లేడీ సింగం గా పేరు దక్కించుకుంది. అయితే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 లో మరోసారి అమ్మాయి విజేతగా నిలిచింది. ఇప్పటికే తమిళ్ సీజన్ 2, సీజన్ 7లలో కూడా అమ్మాయిలే విజేతగా నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్గా చేస్తున్న ఈ షో తమిళ్లో తాజాగా 9వ సీజన్ నడుస్తోంది. 2025 అక్టోబర్ 5న ప్రారంభమైన ఈ సీజన్ 2026 జనవరి 18న గ్రాండ్ ఫినాలే తో ముగిసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రారంభమైన ఈ సీజన్లో మొత్తం 20 మంది పోటీదారులు పాల్గొన్నారు. దివ్య గణేషన్ , సాండ్రా ఆమె భర్తతో పాటూ అమిత్ సహ మొత్తం నాలుగు మంది పోటీదారులు మూడవ వారంలో వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అలా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన దివ్య గణేషన్ విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్ గా శబరి, రెండవ రన్నరప్ గా విక్రమ్ నిలిచారు.

ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ కూడా..

Advertisement

ఇకపోతే టైటిల్ విజేతగా నిలిచిన దివ్య గణేషన్ కి బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ట్రోఫీతో పాటు 50 లక్షలు క్యాష్ ప్రైస్ ను కూడా బహుమతిగా అందించారు. ఇక దివ్య గణేషన్ విషయానికి వస్తే సీరియల్స్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ. భాగ్యలక్ష్మి సీరియల్ ద్వారా ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ఇక బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 లో తన ఆట మాట తీరుతో అందరినీ కట్టిపడేసి టైటిల్ విజేతగా నిలిచి అందరిని ఆకట్టుకున్నారు. మొత్తానికైతే లేడీ టైగర్ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు దివ్య గణేషన్ కి పలువురు సెలబ్రిటీలు ,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ALSO READ:Dhurandhar: గొప్ప ఛాన్స్ మిస్ చేసుకున్న నాగార్జున.. ఆ పాత్రలో గనుక చేసి ఉండుంటేనా?

Advertisement

 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×