BigTV English
Advertisement

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Deepika Padukone: దీపికా పదుకొనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పని గంటల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈమె తరచు వార్తల్లో నిలవడమే కాకుండా పెద్ద సినిమాల నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా దీపిక పదుకొనే(Deepika Padukone) ఎనిమిది గంటల పని వేళలు అలాగే తన రెమ్యూనరేషన్ గురించి తన మెయింటెనెన్స్ గురించి భారీ స్థాయిలో డిమాండ్లు చేసిన నేపథ్యంలోనే స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా నుంచి దీపికను తప్పించడంతో కల్కి 2 సినిమా నుంచి కూడా ఈమెను తప్పించారు.


రంగు, భాష తీరుపై వివక్షత..

ఇలా ఈ విషయం గురించి తరచు వార్తలలో నిలుస్తున్న దీపిక తాజాగా మరోసారి ఇండస్ట్రీలో వివక్షత ఉంది అంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విదేశాలలో తనకు ఎదురైనా చేదు సంఘటన గురించి తెలిపారు. తాను విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ నా రంగు మాట తీరు గురించి విమర్శలు వచ్చాయని తెలిపారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి చాలా సక్రమంగా జరుగుతాయని మనం భావిస్తాము కానీ అలాంటిదే జరగదని దీపిక తెలిపారు.

చాలా చిన్న చూపు చూస్తారు..

మన సెలబ్రిటీలు హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రంగు విషయంలో మాత్రమే కాదు భాష పై కూడా వివక్షతను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో మనవారిపట్ల చాలా చిన్న చూపు ఉంటుందని ఈ వివక్షతను స్వయంగా తాను ఎదుర్కొన్నాను ఆ బాధను ఇప్పటికీ మర్చిపోలేనని దీపికా పదుకొనే తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు. కేవలం హాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి వివక్షతలు ఉన్నాయి అంటూ ఈమె మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వివక్షత ఉంది..

ఇలా ఇండస్ట్రీలో ఉన్న వివక్షత గురించి దీపిక మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక దీపిక సినీ కెరియర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలతో పాటు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో కూడా దీపిక నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక పని గంటల వివాదం కారణంగా ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా నుంచి ఈమెను తప్పించారు. ఇక ఇదే విషయంపై కల్కి చిత్ర నిర్మాతలు కూడా తనని కల్కి 2 నుంచి తప్పించినట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Related News

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Big Stories

×