Tv Anchors : బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ షోలకు యాంకర్స్ గా వ్యవహరిస్తున్న వాళ్ళ సంపాదన గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సీరియల్స్లలో నటిస్తున్న హీరోయిన్ల కన్నా సినిమాలలో నటిస్తున్న హీరోయిన్ల కన్నా కూడా యాంకర్స్ కి ఒక్క రోజుకి రెమ్యూనికేషన్ భారీగానే వస్తుంది. సినిమా ఈవెంట్ నుంచి బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో యాంకర్స్ సందడి చేస్తూ ఆ సినిమాని ముందుకు తీసుకుని వెళుతుంటారు. అలాంటి యాంకర్లలో టాప్ లో ఉన్నది మాత్రం యాంకర్ సుమ. అందరూ ఈమెని లెజెండరీ యాంకర్ అని పిలుస్తారు.. ఈమెతో పాటు మరికొంతమంది యాంకర్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు తెలుగులో టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారు ఎవరు? ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ యాంకర్ సుమ.. తెలుగింటి కోడలు అయ్యాక తెలుగులో బాగా పాపులర్ అయింది. ఈమె ఏ షో చేస్తే ఆ షో హైలెట్ అవుతుంది. ఇక సినిమా ఈవెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ఈవెంట్ అయినా సరే సుమ తన మాటలతో అందరినీ కట్టిపడేస్తుంది. అందుకే చాలామంది సినీ హీరోలు సైతం ఆమెతోనే ఈవెంట్ చేయించుకోవాలని ఆమె డేట్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏంటి సుమా రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు గూగుల్లో వెతికేస్తూ ఉంటారు.. సుమ ఒక్కో ఆడియో ఫంక్షన్‌కు దాదాపు రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సుమ వసూలు చేస్తుందనిది టాక్. ఇది కేవలం ఆడియో వేడుకలకు మాత్రమే అవార్డు ఫంక్షన్ లకు రేటు పెరుగుతుంది.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ రష్మీ.. సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.హోలీ సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా మంచి మార్కులు వేయించుకుంది.. ఈమె బుల్లితెర పై ప్రసారం అవుతున్న టీవీ షోలలో యాంకర్ గా చేసినందుకు లక్షకు పైగా వసూలు చేస్తుందని టాక్..
బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ నీ ప్రారంభించిన ఈ అమ్మడు ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించి యూత్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. ఈమె చలాకితనం అందంతో కొన్ని సినిమాలలో నటించిన కానీ ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్లీ తిరిగి బుల్లితెరపైకి వచ్చేసింది. ఈమె ఒక్కో షో కి దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్..
Also Read : ‘మేఘ సందేశం ‘ భూమి అసలు పేరేంటి..? ఒక్కరోజుకు ఎంతంటే..?
వీళ్లే కాదు యాంకర్ మంజూష, వింధ్య, యాంకర్ శ్యామల వీళ్ళు కూడా సినిమా ఈవెంట్లకు భారీగానే వసూలు చేస్తారని తెలుస్తుంది. అందరికన్నా ఎక్కువగా సుమ తీసుకుంటుంది. ఈమధ్య హిమ చేస్తున్న టీవీ షోల్డర్ అన్నీ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. దానివల్లే ఆమె ఎంత అడిగినా కూడా ఆ షో ప్రొడ్యూసర్లు మాట మాట్లాడకుండా ఇచ్చేస్తున్నారు.