OTT Movie : ఒక సిరీస్ నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో ఉంటూ, IMDbలో 9.1 రేటింగ్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అదే ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ (The Legend of Hanuman). ఈ యానిమేటెడ్ సిరీస్ రామాయణం నుండి హనుమాన్ ని ఫోకస్ చేసి, భారతీయ మిథాలజీని మ్యాజికల్‌గా చూపిస్తుంది. 2021లో సీజన్ 1 వచ్చినప్పటికీ, సీజన్ 6 వరకు వస్తున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌లో టాప్ స్థానంలో ఉంది. గ్రాఫిక్ ఇండియా ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్, ఇండియన్ యానిమేషన్‌లో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 7 భాషలలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ 2021లో వచ్చిన భారతీయ యానిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్. దీనిని షరద్ దేవరాజన్, జీవన్ జె. కాంగ్, చారువి అగర్వాల్ రూపొందించారు. 2021 జనవరిలో సీజన్ 1తో హాట్ స్టార్‌లో మొదలైన ఈ ప్రయాణం, రీసెంట్ గా వచ్చిన సీజన్ 6 వరకూ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. 6 సీజన్ లు వచ్చినా కూడా, వీక్లీ వ్యూస్ 14.8 మిలియన్ లకు చేరుకుందంటే మామూలు విషయం కాదు. చిన్న పిల్లల నుంచి, పెద్దల దాకా ఈ సిరీస్ ను బాగా ఇష్టపడుతున్నారు.
హనుమాన్ చిన్నప్పటి నుంచి తన శక్తులు మర్చిపోయి, సాధారణ వానరుడిగా సూగ్రీవ్ రాజు సేవలో ఉంటాడు. ఈ సమయంలో రాముడు, సీతను వెతకడానికి సూగ్రీవ్ సహాయం కోరతాడు. హనుమాన్, రాముడితో కలిసి సీతను వెతకడానికి అడవిలో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో హనుమాన్ తన శక్తులు మర్చిపోయినా, ధైర్యం, విశ్వాసంతో పోరాడతాడు. ఎన్నో అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తాడు. రాముడికి సహాయం చేస్తూ, ఆయన సేవలో లీనమవుతాడు.
రామ్, లక్ష్మణ్‌తో హనుమాన్ కలిసి లంకకు కూడా వెళ్తాడు. అక్కడ సీతను చూసి రావణుడికి బుద్ది చెప్పాలనుకుంటాడు. హనుమాన్ తన శక్తులతో రావణ్‌ను భయపెడతాడు. అక్కడ లంకా దహనం చేసి తిరిగి రాముడి దగ్గరకి వస్తాడు. హనుమాన్ తన పూర్తి శక్తులను పొంది, రాముడికి సహాయం చేస్తూ, రావణ్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి రావణుడిని ఓడించడంలో హనుమాన్ కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సిరీస్ రామాయణ కథను కొత్తగా, హనుమంతుడి అద్భుతాలను గొప్పగా చూపిస్తుంది.