Bengaluru Crime: కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువతి గొంతుకోసి పరారయ్యాడు యువకుడు. ఈ ఘటనలో గిలగిలా కొట్టుకుంటూ స్పాట్ లో యువతి మృతి చెందింది. గురువారం మధ్యాహ్నం శ్రీరాంపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అసలేం జరిగింది?
బెంగుళూరులో దారుణం
కర్ణాటక రాజధాని బెంగుళూరులోని హోస్కెరెహళ్లి ప్రాంతంలో 20 ఏళ్ల యామిని ప్రియ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. గురువారం పరీక్ష కోసం ఉదయం దాదాపు ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యాహ్నాం మూడు గంటల సమయంలో మంత్రి మాల్ సమీపంలోని రైల్వేట్రాక్ సమీపంలో నడుచుకుంటూ ఇంటికి వస్తోంది.
ఆ సమయంలో యువతి ఓ యువకుడు దాడి చేశాడు. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో యామిని గొంతు కోసి పరారయ్యాడు. స్పాట్‌లో పడిపోయిన యామిని, రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఊహించని ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యువతి ఘటన తెలియగానే అందరూ అక్కడికి చేరుకున్నారు. కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
యువతి గొంతు కోసి చంపేశాడు
వెంటనే యువతిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందింది. నేరం జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలు సేకరించారు పోలీసులు. నిందితుడి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే యామినిప్రియా-ఆ యువకుడు బైక్ మీద వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షుల మాట. వీరిద్దరి మధ్య ప్రేమ కోణం ఉందనే చర్చ లేకపోలేదు.
ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితురాలు, నిందితుడు ఇద్దకగ ఒకే ప్రాంతానికి చెందినవారు. త్వరతలో నిందితుడ్ని అరెస్టు చేస్తామని తెలిపారు పోలీసులు. ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడమే దాడికి దారి తీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ALSO READ: చిత్తూరు జిల్లాలో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు
నిందితుడు 23 ఏళ్ల విఘ్నేష్‌గా భావిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఆమె కళ్ళపై విష పదార్థాన్ని పోశాడని అంటున్నారు. ఆపై పదునైన ఆయుధంతో ఆమె మెడ, ముఖంపై కోసి చంపాడని తెలిపారు. అధిక రక్తస్రావం కారణంగా యువతి అక్కడికక్కడే మరణించింది. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. మరోవైపు యువతి కాల్ డేటాను చెక్ చేస్తున్నారు.