Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. తాజాగా 39వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో మిగతా కంటెస్టెంట్స్ ని ఊరిస్తూ.. అటు పచ్చళ్ళ పాప రమ్య మోక్ష (Ramya moksha).. ఇటు సుమన్ శెట్టి(Suman Shetty) లాగించేశారు.. ఇకపోతే ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒకేసారి కనిపించేసరికి మిగతా కంటెస్టెంట్స్ కి నోరూరిపోయింది. ఇక ఇమ్మానియేల్(Emmanuel )గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఒక్క ముక్కైనా షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించండి బిగ్ బాస్ అంటూ కెమెరా ముందు తెగ వేడుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోకి మరింత ఫన్ జోడించారు అని చెప్పాలి.
విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా 6 మంది అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అలా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలకు ఒక్కొక్కరికి ఒక్కో ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే పచ్చళ్ళ ద్వారా భారీ ఫేమస్ అయిన రమ్య మోక్ష కి ఒక్క రోజుకి నచ్చిన ఫుడ్ ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాదు తనకు వచ్చిన ఆహారాన్ని ఒకరితో షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడంతో ఆమె సుమన్ శెట్టిని ఎంపిక చేసుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టితో కలిసి ఒక పెద్ద లిస్టు ని బిగ్ బాస్ ముందు ఉంచింది రమ్య మోక్ష. ఆ లిస్టులో..బ్రేక్ ఫాస్ట్ కి.. ఉప్మా పెసరట్టు, పూరీ , మైసూర్ బజ్జి, కాఫీ కోరింది. లంచ్ కి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ కోరింది.స్నాక్స్ కి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ లు మూడు అడిగిన ఈమె.. వెజ్ టిక్కా పిజ్జా, మిక్సర్ ప్యాకెట్, బనానా చిప్స్ కోరింది. అలాగే ఫోర్ ఎగ్ ట్రేస్, 2 కేజీ మోతీచూర్ లడ్డూలు, జాంగ్రీ , నెయ్యితో పాటు వెజ్ , నాన్ వెజ్ పికెల్స్, చాక్లెట్, ఒక సీతాఫలము, 5 కేజీల చికెన్, పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పుకారంతో కలిపి ఇవ్వాలి అని అలాగే గోల్డెన్ క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రాన్స్ కావాలి అని కోరింది.
అయితే తన కోరికను తీర్చేశారు బిగ్ బాస్. ఈరోజు ఆమె అడిగిన ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా పంపించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. బ్రేక్ ఫాస్ట్ టైం లో బిగ్ బాస్ ను రమ్య ఏవైతే అడిగిందో.. అన్ని టేబుల్ పై అలా వచ్చేసాయి. మిగతా కంటెస్టెంట్స్ అంతా ఆ వంటకాలను చూసి పాపం తినలేని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోయారు. ఇమ్మానుయేల్ అయితే వాటి రుచులను చూసి ఆస్వాదించలేడు కాబట్టి వాసన చూస్తూ ఆస్వాదించడం చూస్తే తెగ కామెడీ అనిపించింది.
ఆ తర్వాత లంచ్ కి బిర్యానీ పంపించారు. బిగ్ బాస్ టేబుల్ పై ఉంచిన లంచ్ ను కళ్యాణ్ చూపించకుండా దాచిపెట్టగా ఇమ్మానుయేల్ తినను రా జస్ట్ చూస్తాను.. చికెన్ కావాలి నాకు అంటూ గట్టిగట్టిగా అరిచేసాడు. నాకెందుకు ఇవ్వరు.. నేనేమైనా చెత్త కుప్పలో దొరికానా మీకు? అంటూ ఏడుస్తూ కామెడీ పండించాడు. సుమనన్నే మీ కొడుకా నేను కాదా.. ఒక్క పీస్ ఇవ్వమని చెప్పండి బిగ్ బాస్.. పోనీ వాళ్ల దగ్గర అడుక్కొని తినవచ్చు అని అయినా పర్మిషన్ ఇవ్వండి బిగ్ బాస్ అంటూ కెమెరా ముందు అడుక్కున్నాడు ఇమ్మానుయేల్. మొత్తానికైతే ఫుడ్డు కోసం తన కామెడీతో అందరికీ నవ్వు తెప్పించి, రియల్ ఎంటర్టైనర్ గా పేరు సొంతం చేసుకున్నారు ఇమ్మానుయేల్.
ALSO READ:HBD Hema Malini: ఏజ్ లెస్..77 ఏళ్లలో కూడా స్టిల్ యంగ్.. ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?