BigTV English

BB Telugu 8: శ్రీముఖి దెబ్బకు విష్ణుప్రియ అలర్ట్ అవుతుందా..?

BB Telugu 8: శ్రీముఖి దెబ్బకు విష్ణుప్రియ అలర్ట్ అవుతుందా..?

BB Telugu 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుంది. ఇక 8వ సీజన్ ఏడాది సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే జరగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సీజన్ ముగియడానికి కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగా టైటిల్ గెలవాలనే తపనతో ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇక అందులో భాగంగానే టికెట్ టు ఫినాలే రేస్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో మొదటి ఫైనలిస్ట్ అవడం కోసం కంటెస్టెంట్స్ భారీగానే పోటీపడ్డారు. అంతేకాదు కంటెస్టెంట్స్ కి టాస్క్ లు నిర్వహించడానికి మాది బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా అఖిల్, దేత్తడి హారిక, పునర్నవి, మానస్, ప్రియాంక జైన్, వితిక షేర్ వంటి వారు హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేశారు. ఇక చివరిగా శ్రీముఖి(Sree Mukhi) నిన్న ఎపిసోడ్లో అలరించిన విషయం తెలిసిందే .ఇక టికెట్ టు ఫినాలే ఆఖరి పోటీ నిర్వహించి ఎవరో ఒకరికి టికెట్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతానని చెప్పింది.

అందులో భాగంగానే ఒకవైపు తాను వచ్చిన పనిని నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తన ఫ్రెండ్ విష్ణు ప్రియను అలర్ట్ చేసింది శ్రీముఖి. శ్రీముఖి విష్ణుప్రియతో మాట్లాడుతూ.. నువ్వు పృథ్వీ వెంట పడుతున్నావు.. కానీ అతడు నిన్ను ఛీ కొడుతున్నా.. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్.. ముందు అతడిని, అతడి పై ఉన్న ఇష్టాన్ని పక్కన పెట్టి గేమ్ పైన ఫోకస్ చెయ్. మిగిలి ఉన్నది రెండు వారాలే. ప్రస్తుతం నీకు బ్లాక్ బ్యాడ్జ్ కూడా ఇచ్చారు కదా.. నీపై నెగెటివిటీ మరింత పెరిగిపోతుంది. దయచేసి అతడిని పక్కన పెట్టి గేమ్ పైన కాన్సెంట్రేట్ చెయ్ అంటూ ఆమెను అలర్ట్ చేసింది. మరి శ్రీముఖి సలహా మేరకు విష్ణు ప్రియ అలర్ట్ అవుతుందో లేదో చూడాలి. మొత్తానికైతే స్నేహితురాలి కోసం బాగానే కష్టపడుతోంది శ్రీముఖి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఇక మరోవైపు టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్ లో నిఖిల్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి పోటీపడ్డారు. నాలుగు ఓట్లు సొంతం చేసుకొని టికెట్ టు ఫినాలే మొదటి ఫైనలిస్ట్ గా నిలిచారు అవినాష్. ఇక టాప్-5 లోకి నిఖిల్, గౌతమ్, విష్ణుప్రియ, అవినాష్, నబీల్ వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత టాప్ -5 కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ భారీగా పోటీ పడుతున్నారు మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి. వాస్తవానికి గౌతమ్ కి ఓటింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ వైల్డ్ కార్డు కాబట్టి ఆయనకు టైటిల్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సో ఈ సీజన్ టైటిల్ విన్నర్ నిఖిల్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×