Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ 9 కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కొత్తగా సరికొత్తగా కనిపిస్తుంది.. డబల్ హౌస్ డబల్ డోస్ అంటూ నాగార్జున రణరంగం గురించి వివరించారు.. అలాగే హౌస్ లోని ప్రత్యేకతల గురించి నాగార్జున బిగ్ బాస్ ఇద్దరూ ఆడియన్స్ కి చూపించారు. రెండు హౌస్లతో ఈసారి రణ రంగం మామూలుగా ఉండదు అంటూ నాగార్జున అన్నాడు. అనంతరం సామాన్యుల గురించి ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసి అందరి గురించి పరిచయం చేసుకున్నాడు నాగార్జున.. ఇక ఇప్పటివరకు హౌస్ లోకి ఏడు మంది ఎంట్రీ ఇచ్చారు. ఎనిమిదవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే సాంగ్ తో మైండ్ బ్లాక్ చేసి స్టెప్పులతో ఈమె ఎంట్రీ మాములుగా లేదు.. ఎంట్రీ తోని నాగార్జునకే కౌంటర్ ఇచ్చింది రీతు..
8వ కంటెస్టెంట్ గా రీతూ చౌదరి..
ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కాసేపటి క్రితం గ్రాండ్గా లాంచ్ అయింది.. గతంలో అనుకున్న దాని కంటే ఈ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని ప్రస్తుతం హౌస్ ను చూస్తే అర్థమవుతుంది.. రెండు హౌస్ లతో పాటుగా కిచెను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ ని పరిచయం చేసిన తర్వాత కంటెస్టెంట్లను నాగార్జున స్టేజ్ మీదకి పిలిచారు. ఇప్పటివరకు తనూజ, ఫ్లోరా షైనీ, లతో ముందుగా అనుకున్న వాళ్ళందరూ ఎంట్రీ ఇచ్చారు. ఎనిమిదవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ డాన్స్ తో మొదలవడంతో ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా చూశారు..
ఎంట్రీతోనే రీతూకు షాకిచ్చిన నాగార్జున..
హౌస్ లోకి రీతు అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది.. ఆమె ఎంట్రీ ఇవ్వగానే నాగార్జున హాయ్ దివ్య అంటూ పిలిచారు. ఆ మాట వినగానే రీతు వద్దు సార్ ఆ పేరుతో నన్ను పిలవకండి ఆ పేరు అంటే నాకు అసలు నచ్చదు అంటూ అంది. ఎందుకమ్మా నీకు ఈ పేరు నచ్చదు ఆడియన్స్ అందరికీ చెప్పు అనేసి నాగార్జున అంటాడు. చిన్నప్పుడు మా స్కూల్లో మా క్లాసులో ఎనిమిది తొమ్మిది మంది దివ్యాలు ఉండేవారు అందుకే నా పేరు అంటే నాకు అసలు నచ్చదు అని అంది. రీతులు నాకు 10 మంది తెలుసు. నేను కూడా ఒకదాన్ని అనుకోండి సార్ అంటూ రీతూ అంది.. మొత్తానికి అయితే రీతు ఎంట్రీ గ్రాండ్ గాని ఉంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రీతు టాస్కులలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ ను చూడాల్సిందే..