BigTV English

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… శోభిత ధూళిపాళని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… శోభిత ధూళిపాళని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : ఓటీటీలో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ‘ది నైట్ మేనేజర్’ సిరీస్ ఆడియన్స్ ని ఇంకా అలరిస్తూనే ఉంది. ఈ సిరీస్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సిరీస్ 2023 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో 6 నామినేషన్లు, 52వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సిరీస్ నామినేషన్ పొందింది. థ్రిల్లర్ అభిమానులకు ఈ సిరీస్ ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఎందులో ఉందంటే

‘ది నైట్ మేనేజర్’ (The Night Manager)  2023లో విడుదలైన యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. సందీప్ మోడీ దీనిని సృష్టించారు. జాన్ లే కారే రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్, ఇది 2016 బ్రిటిష్ సిరీస్‌కు రీమేక్. అనిల్ కపూర్ (షైలేంద్ర “షెల్లీ” రుంగ్టా), ఆదిత్య రాయ్ కపూర్ (శాంతను “శాన్” సేన్‌గుప్తా), శోభితా ధూళిపాళ్ల (కావేరి), తిల్లోతమ షోమ్ (లిపిక సాయికియా రావు) ప్రధాన పాత్రల్లో నటించారు. జియో హాట్‌స్టార్‌లో 2023 ఫిబ్రవరి 17న పార్ట్ 1 (4 ఎపిసోడ్‌లు), 2023 జూన్ 29న పార్ట్ 2 (3 ఎపిసోడ్‌లు) విడుదలై, 7 ఎపిసోడ్‌లతో IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

షాన్ ఒక మాజీ భారత నౌకాదళ అధికారి. ప్రస్తుతం ఢాకాలోని ఒక ప్రముఖ హోటల్‌లో నైట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. 2017లో రోహింగ్యా జెనోసైడ్ నేపథ్యంలో, షాన్‌ను 14 ఏళ్ల సఫీనా కిడ్వాయ్ అనే అమ్మాయి కలుస్తుంది. ఆమెను హోటల్ యజమాని అయిన ఫ్రెడ్డీ రెహ్మాన్‌తో పెళ్ళి జరుగుతుంది. షాన్‌ను ఆమె భారత్‌కు తప్పించుకునేందుకు సహాయం అడుగుతుంది. కానీ అతను నిరాకరిస్తాడు. దీంతో ఆమె అతని ఫోన్‌ను దొంగిలించి, షైలేంద్ర ‘షెల్లీ’ రుంగ్టా ఫ్రెడ్డీల మధ్య అక్రమ ఆయుధాల ఒప్పందం గురించిన సమావేశాన్ని రహస్యంగా రికార్డ్ చేస్తుంది.


ఈ రికార్డింగ్ షాన్‌ను షెల్లీ రుంగ్టా అనే శక్తివంతమైన ఆయుధ వ్యాపారి సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయే ఒక రహస్య మిషన్‌లోకి నడిపిస్తుంది. షాన్, భారత గూఢచారి సంస్థతో కలిసి, షెల్లీ యుద్ధ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రమాదకరమైన ఆటను ఆడతాడు. ఈ కథలో శోభిత ధూళిపాళ, తిలోత్తమ షోమ్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన కథనం, అద్భుతమైన నటనలకు ప్రశంసలు అందుకుంది.

Read Also : కోరి శాపాన్ని కొని తెచ్చుకునే ఫ్యామిలీ… నెక్లెస్ కు దెయ్యాలతో లింక్… సీట్ చిరిగిపోయే హర్రర్ మూవీ

Related News

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మలయాళ సినిమాలు ఇవే

OTT Movie : బిల్డింగ్ లో మర్డర్ మిస్టరీ… ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది… ఇంటెన్స్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బీచ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్… రెండుసార్లు జైలు నుంచి బికినీ కిల్లర్ ఎస్కేప్… పోలీసులు ఇచ్చే షాక్ కు మైండ్ బ్లా

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

Big Stories

×