Pravin Tambe : సాధారణంగా క్రికెట్ (Cricket)లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కొందరూ క్రీడాకారులు ప్రతిభ ఉన్నప్పటికీ.. వెలుగులోకి రారు. మరికొందరూ చాలా త్వరగా వెలుగులోకి వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు చాలానే నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరూ తక్కువ సమయంలో ఫేమస్ అయితే మరికొందరూ చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తారు. ఇలాంటి సంఘటనే ఓ క్రీడాకారుడికి చోటు చేసుకుంది.అతను దాదాపు 41 సంవత్సరాల వరకు పెద్దగా క్రికెట్ అభిమానులకు ఎవ్వరికీ తెలియదు. క్రికెటర్లకు తెలుసు. వాళ్లతో కలిసి అన్ని పనులు చేసేవాడు. కానీ అతనికి క్రికెట్ ఆడేందుకు మాత్రం అవకాశాలు రాలేదు. ఎలాగో అలా అవకాశాలు దక్కించుకొని ఐపీఎల్ ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ క్రికెటర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Hardik Pandya : హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంతో తెలుసా… పాకిస్తాన్ బాబర్ ఆస్తులు మొత్తం అమ్ముకున్న సరిపోదు
సాధారణంగా క్రికెట్ (Cricket) లో 40 సంవత్సరాల వయస్సు వచ్చిందంటే..? చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ అవుతారు. కొందరూ మాత్రమే తమ కెరీర్ ను అలాగే కొనసాగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఒక ఆటగాడు 40 సంవత్సరాల సమయంలోనే తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. అతని పేరు ప్రవీణ్ తాంబే (Pravin tambe). ఇతను ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అయితే ప్రవీణ్ తాంబే (Pravin tambe) కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ గోల్ ఏంటంటే..? ఎలాగైనా సరే రంజీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అతని కోరిక అంట. అయితే అతను చాలా సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం రాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ.. అతనికి మాత్రం అవకాశాలు మాత్రం రావడం లేదు. అతను క్లబ్ క్రికెటర్ గా వర్క్ చేశాడు. కన్ స్ట్రక్షన్స్ సూపర్ వైజర్ గా వర్క్ చేశాడు. మ్యాచ్ ఆర్గనైజర్ గా కూడా వర్క్ చేశాడు ప్రవీణ్ తాంబే. కానీ తనకు రంజీ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం రాలేదు.
మరో విశేషం ఏంటంటే..? రాత్రి సమయంలో క్లబ్ ల్లో, బార్లలో కూడా వర్క్ కూడా చేశాడట. ఇలా వర్క్ చేయడం వల్ల మార్నింగ్ సమయంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చని భావించాడు. అతని ఫ్యామిలీ భయపడిపోయింది. వీడేంటిరా.. క్రికెట్.. క్రికెట్ అని ఇలా తయారయ్యాడు. ఇక్కడ ఫ్యామిలీ పరిస్థితేమో చాలా అధ్వాన్నంగా ఉంది. అని చెప్పినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోయాడు. తాను వెనుకడుగు మాత్రం వేయలేదు. రంజీ మ్యాచ్ (Ranji Match) లకు ఎంట్రీ ఇవ్వకుండానే నేరుగా ఐపీఎల్ మ్యాచ్ లకు అడుగుపెట్టాడు. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అతని కోసం చాలా ఆసక్తికనబరిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Rayals) జట్టు అతన్ని కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున అతను ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సమయంలో అందరూ నవ్వారు. 41 వయస్సులో ఎంట్రీ ఏంటీ..? ఆశ్చర్యపోయారట. కానీ ప్రవీణ్ తాంబే (Pravin Tambe) అందరినీ సైలెంట్ చేశారట. బెస్ట్ బ్యాట్స్ మెన్ గా, బెస్ట్ బౌలర్ గా నిరూపించుకున్నాడు. నో రంజీ దగ్గర నుంచి ఐపీఎల్ స్టార్ గా ఎదిగాడు. ఐపీఎల్ స్టార్ (IPL Star) గా ఎదిగిన తరువాత ఆయనకు రంజీ ట్రోఫీలో అవకాశం వచ్చింది. ఈయన జర్నీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరి ఉన్నంత వరకు మన గోల్ కోసం పోరాడితే.. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా సక్సెస్ (Success) సాధించవచ్చని నిరూపించాడు.
?igsh=dDJzdnA0ZG5lYmNp