Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం అటు హిందీలో 19వ సీజన్ ప్రారంభమవగా.. తెలుగులో 9వ సీజన్ ప్రారంభం అయ్యింది. ఇకపోతే ఈ తొమ్మిదవ సీజన్లో 8 వారాలు పూర్తయ్యాయి.. తొమ్మిదవ వారం మొదలైంది. ఈరోజు సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. రసవత్తరంగా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో రీతూ చౌదరి తన బాండింగ్ గురించి ఓపెన్ అయ్యింది. ముఖ్యంగా సంజనా చేసిన పనికి రీతూ చౌదరి మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రోమోలో హైలెట్గా నిలిచాయి అని చెప్పవచ్చు.
తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికొస్తే.. 57వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో నామినేషన్స్ ప్రక్రియ మొదలయింది. బిగ్ బాస్ మాట్లాడుతూ.. “ఎదురుగా ఉన్న టేబుల్స్ పైన కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిపైన ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్నాయి. బజర్ మోగగానే బొమ్మల్లోని వేరే వాళ్ళ ఫోటో ఉన్న బొమ్మను తీసుకొని.. సేఫ్ జోన్ లోకి ముందుగా పరిగెత్తాలి.. ఆఖరిగా ఉన్న ఇంటి సభ్యులు.. ఆ బొమ్మ మీద ఎవరి ఫోటో అయితే ఉందో వారు.. అలా ఇద్దరూ నామినేషన్ జోన్ లోకి వస్తారు అంటూ బజర్ మోగించారు బిగ్ బాస్. ఇక బజార్ మోగగానే ఇంటి సభ్యులంతా ఆ బొమ్మల పై వేరే వారి ఫోటోలు ఉన్న బొమ్మలను తీసుకొని సేఫ్ జోన్ లోకి పరిగెత్తారు. చివరిగా సంజన మిగిలిపోయింది ఉన్న ఒక బొమ్మను తీసుకొని ఆమె నామినేషన్ చేయడానికి వచ్చింది..
also read:Bigg Boss Buzz: భయం అన్నది బ్లడ్ లోనే లేదు.. శివాజీకే ఇచ్చి పడేసిన మాధురి!
అయితే సంజన రీతూ చౌదరి ఉన్న బొమ్మను చివరిగా తీసుకొచ్చి ఇద్దరు నామినేషన్ జోన్లోకి వచ్చారు. సంజన మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను సోలోగానే గేమ్ ఆడుతున్నాను. రీతు ఆటలో ఎక్కడో డెమోన్ పవన్ కాంట్రిబ్యూషన్ ఉంది.. అది మనందరికీ కనిపిస్తోంది అంటూ సంజన చెప్పగా.. రీతు చౌదరి మాట్లాడుతూ.. మీరు ఒక్కరే ఉంటూ ఒక్కరితోనే ఆట ఆడుతూ సోలోగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నానంటే ఎలా ఒప్పుకుంటారు. ఈ హౌస్ లో ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉంది. అలాగే నాకు కూడా ఒకరితో బాండింగ్ ఉంది. కానీ మీరు ఆ బాండింగ్ను తప్పుగా అర్థం చేసుకుంటే నాకు ఎటువంటి సమస్య లేదు అంటూ రీతూ చౌదరి తన రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యింది . అలాగే తనూజ కూడా తన నామినేషన్స్ లో భాగంగా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఏది ఏమైనా హౌస్ లో ఎవరి మాస్క్ ఎలా ఉండనుంది అనే విషయాన్ని కంటెస్టెంట్స్ ఒకరి తర్వాత ఒకరు రివీల్ చేశారు.