Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ- కారు ఢీ కొని నలుగురు మృతి చెందారు. బాపట్లలోని ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో.. ఎదురుగా ఓ టిప్పర్ లారీ అతి వేగంతో కారును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంస అయిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి.. తీవ్రగాయాలతో ఉన్న వారిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. మృతులు బేతాళం బలరామ రాజు. బేతాళం లక్ష్మీ, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.