Road Accident: ఖమ్మం- వరంగల్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్‌కు గ్రానైట్ లారీ వెళ్తుంది. తొర్రూరు మండలం నాంచారిమడూరు సమీపంలో లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటిలో నివసిస్తున్న లక్ష్మీ అనే మహిల తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరస ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.