Bigg Boss Buzz: మిగతా సీజన్లతో పోల్చుకుంటే తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss Telugu) కార్యక్రమానికి మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే ఎనిమిది వారాలు పూర్తికాగా.. 9వ వారం కూడా ప్రారంభం అయింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరైనా ఎలిమినేట్ అయితే.. వారిని నేరుగా బిగ్ బాస్ బజ్ అంటూ మరో కార్యక్రమానికి పంపిస్తారు. అందులో హౌస్ లో వారు చేసిన తప్పులను వారి పెర్ఫార్మెన్స్ ను చూపిస్తూ ఇటు రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ (Shivaji )హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
గత సీజన్ 8 బిగ్ బాస్ బజ్ కి అంబటి అర్జున్ హోస్ట్ గా వ్యవహరించగా.. ఇప్పుడు శివాజీ తనదైన మాట తీరుతో కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ వారికి ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి శివాజీకి తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చింది దివ్వెల మాధురి. భయపడడం తన బ్లడ్ లోనే లేదు అంటూ ఝలక్ ఇచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
also read:SSMB 29: ఫ్యాన్స్ కి షాక్.. వారణాసి టైటిల్ అనౌన్స్.. రాజమౌళి స్పందిస్తారా?
విషయంలోకి వెళ్తే.. తాజాగా ఎనిమిదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైకి రాగానే ఆమె బిగ్ బాస్ జర్నీ ఏవి చూసి కన్నీళ్లు పెట్టుకుంది
.ఆ తర్వాత కంటెస్టెంట్స్ యొక్క మాస్కులను బయటపెడుతూ అందరిని ఆశ్చర్యపరిచిన ఈమె. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ కి హాజరైంది. షో కి హాజరు కాగానే మిమ్మల్ని మాధవి అని పిలవాలా? మాధురి అని పిలవాలా అని శివాజీ అడగగా.. నా పేరు మాధురి.. మాధవి కాదు అంటూ ధైర్యంగానే సమాధానం చెప్పింది. ఇదేదో ఆ రోజే చెప్పి ఉంటే ఆ అమ్మాయితో గొడవ ఉండేది కాదు కదా అని శివాజీ ప్రశ్నించగా.. అందరితో అలా చెప్పను నచ్చితేనే చెబుతాను అంటూ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది.
100% తెలుగు వాళ్ళ ప్రజల్లో ఉంటానని వెళ్లారు మరి వెళ్తే ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా.. వాళ్ళు నన్ను పంపించలేదు.. నాకు రావాలనిపించి నేనే వచ్చాను. వెళ్లాలనిపించింది కాబట్టి వెళ్ళాను రావాలనిపించింది కాబట్టి వచ్చాను అంటూ సమాధానం చెప్పింది మాధురి. మీరు అరిచే అరవడాలకు భయం వేస్తోంది అని శివాజీ ప్రశ్నిస్తే.. ఎవరు మీకా అంటూ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఒక దశలో మీరు భయపడినట్లు అనిపించింది అని శివాజీ అడగగా.. భయం అనేది నా బ్లడ్ లోనే లేదు అంటూ శివాజీ కే గట్టి కౌంటర్ ఇచ్చింది మాధురి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య టాపిక్స్ ఎంత రసవత్తరంగా ఉన్నాయో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు చూడాలి