BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి మాధురి అవుట్.. 22రోజుల్లో ఎంత సంపాదించిందంటే..?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి మాధురి అవుట్.. 22రోజుల్లో ఎంత సంపాదించిందంటే..?

Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం తెలుగులో తొమ్మిదవ సీజన్ ప్రసారం అవుతుంది. నిన్న వీకెండ్ ఎపిసోడ్ కావడంతో ఎనిమిదో వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లపై నామినేషన్స్ వేటు పడింది. ఎనిమిదో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారా అని ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఇది ఎవరు ఊహించని విధంగా హౌస్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది.. గత వారమే ఈమె హౌస్ నుంచి బయటకు వస్తుందని అనుకున్నారు. కానీ భరణి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం గౌరవ్ వెళ్తాడని అనుకున్నారు. కానీ ఈమె బయటకు వచ్చేసింది. ఇక ఇప్పటివరకు ఈమె బిగ్ బాస్ నుంచి ఎంత సంపాదించింది అన్నది ఆసక్తిగా నెలకొంది.. మరి 22 రోజులకు ఎన్ని లక్షలు అందుకుందో చూడాలి..


దువ్వాడ మాధురి రెమ్యూనరేషన్..?

బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చినవాళ్లు దువ్వాడ మాధురి ఒకరు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత ప్రతిరోజు ఈమె హౌస్ మేట్స్ తో గొడవలు పడుతూనే ఉంది. అంతేకాదు టాస్క్లలో కూడా నువ్వా నేనా అని పోటీపడి మరి ఆడింది. టాస్క్ ల పరంగా పాజిటివ్ టాక్ ని అందుకున్న సరే.. ఈమె గొడవలకు కేరాఫ్ గా మారడంతో జనాలు కూడా ఈమెను బయటకు పంపించాలని అనుకున్నారు. గతవారం డేంజర్ జోన్లో ఈమె ఉన్న సేఫ్ అయ్యింది. ఇప్పుడు మాత్రం తక్కువ ఓటీంగ్ రావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. దాదాపు 22 రోజుల పాటు హౌస్ లో ఉన్న ఈమె 3 వారాలు హౌజ్‌లో ఉన్న బిగ్ బాస్ మాధురి సుమారుగా లక్ష 20 వేల రూపాయలు అందుకుంది. మూడు వారాలకు బాగానే సంపాదించింది.

Also Read : డీలా పడ్డ కార్తీక దీపం.. టాప్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు..ఈ వారం రేటింట్స్..?


ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..? 

బిగ్ బాస్ సీజన్ 9 లో శ్రేష్టి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, భరణి శంకర్, గత వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. మళ్లీ కొందరు కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరికి బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేన్స్ నిర్వహించారు. బిగ్ బాస్ తెలుగు 9 ఈవారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది ఉన్నారు..నిన్నటి ఎపిసోడ్ లో మాధురి ఎలిమినేట్ అయ్యారు. ఇక 9 వ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

ప్రస్తుతం 9వ వారం నామినేషన్స్ ఇవాళ ఎపిసోడ్ లో జరగనున్నాయి. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. దాంతో తొమ్మిదవ వారం నామినేషన్స్ పై జనాలు ఆసక్తి కనబరిస్తున్నారు. గతవారం డేంజర్ జోన్ లో ఉన్నా రామ్ రాథోడ్, అలాగే గౌరవ్ లు ఈవారం ఎలిమినేట్ అవుతారేమో చూడాలి..

Related News

Akkineni Nagarjuna: ఛీఛీ..వరస్ట్ హోస్ట్ ఎవర్.. నాగ్ పై మండిపడుతున్న నెటిజన్స్

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో హీటేక్కిస్తున్న నామినేషన్స్.. టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..?

Bigg Boss 9 Promo: నామినేషన్ వార్.. బాండింగ్ పై స్పందించిన రీతూ చౌదరి..

Bigg Boss Buzz: భయం అన్నది బ్లడ్ లోనే లేదు.. శివాజీకే ఇచ్చి పడేసిన మాధురి!

Bigg Boss 9 day 56 : మాధురి ఎలిమినేటెడ్, తనుజ వెన్నుపోటు, హౌస్ లో ఎవరు ఎలాంటివారు

Bigg Boss 9 : అప్పుడు అభిజిత్, ఇప్పుడు పవన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తున్న బిగ్ బాస్ యాజమాన్యం

Bigg Boss 9 : ఇంక షో ఆపేసి కప్పు ఆవిడకి ఇచ్చేయండి, ఇదేం మేనేజ్మెంట్?

Big Stories

×