EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ నవంబర్ 1 నుంచి ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ 2025 ను ప్రారంభించింది. ఆరు నెలల సమయంలో ఈపీఎఫ్ లో నమోదు కాని ఉద్యోగులకు కనీస జరిమానా విధించి సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించనున్నారు. సామాజిక భద్రతా కవరేజీ విస్తరణ, అంతరాలను పరిష్కరించడమే లక్ష్యంగా కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ – 2025 ప్రారంభించారు.
జులై 1, 2017 నుంచి అక్టోబర్ 31, 2025 మధ్య ఉద్యోగాల్లో చేరిన వారికి పీఎఫ్ కవర్ లేకపోతే స్వచ్ఛందంగా ఈపీఎఫ్ఓ లో జాయిన్ అవ్వడానికి ఆరు నెలల సమయం(ఏప్రిల్ 30, 2026) ఇచ్చింది కేంద్రం. ఆయా సంస్థల అలాంటి ఉద్యోగులను గుర్తించి వారికి ప్రయోజనాలు కల్పించవచ్చు. యజమాని వాటా, సెక్షన్ 7Q కింద వడ్డీ, ఛార్జీలు, రూ.100 జరిమానా చెల్లించి ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కవరేజీ కల్పించవచ్చు.
గతంలో ఈపీఎఫ్ పరిధిలో ఉన్నా, లేకపోయినా, ఏదైనా ఉల్లంఘనతో దర్యాప్తులో ఉన్న సంస్థలు ఈ పథకం కింద రూ.100 జరిమానాతో సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్హులు అవుతారని కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. గత నాలుగేళ్లలో వేతన పరిమితులు, ఇతర కారణాలతో ఈపీఎఫ్ కవరేజీలోకి రాని ఉద్యోగులను పీఎఫ్ లో భాగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. యజమానులకు క్లీన్ అప్ విండోను కల్పిస్తుంది. భారీ జరిమానాలు లేకుండా ఈపీఎఫ్ఓ సమస్యలను క్రమబద్ధీకరించడానికి ఆరు నెలల సమయం ఇచ్చింది.
Also Read: Business News: నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఆఫీసు హైదరాబాద్‌లో.. ఆ బిల్డింగ్‌లో బడా సంస్థలు, ఎక్కడంటే..