BigTV English
Advertisement

BB Telugu 8: సండే.. ఫన్ డే.. కొత్త టాస్క్ తో కొత్త రచ్చ..!

BB Telugu 8: సండే.. ఫన్ డే.. కొత్త టాస్క్ తో కొత్త రచ్చ..!

BB Telugu 8:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఒక ఓటీటీ వెర్షన్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ప్రారంభం అయింది. ఇందులో తొమ్మిదవ వారం ఈరోజుతో పూర్తి కాబోతోంది. ఇక తొమ్మిదవ వారంలో భాగంగా నయని పావని (Nayani pavani)ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. ఇకపోతే ఈరోజు సండే కాబట్టి.. “సన్ డే.. ఫన్ డే” అనే కాన్సెప్ట్ తో మరో కొత్త టాస్క్ తో ఫుల్ ఎనర్జీతో కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు హోస్ట్ నాగార్జున.


ఈ క్రమంలోనే తాజాగా 63వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. మరి ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. చాలా కలర్ ఫుల్ గా సంతోషంగా స్టేజ్ పైకి విచ్చేశారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). లెహరాయి లెహరాయి అంటూ అమ్మాయిల హృదయాలను దోచుకున్నారు నాగార్జున. ఇక స్టేజ్ పైకి రాగానే ఆయన లుక్ చూసి లేడీ కంటెస్టెంట్స్ మొత్తం ఫిదా అయిపోయారు. ఇ ఎప్పటిలాగే నాగార్జున మాట్లాడుతూ..” టుడే సండే ఫన్ డే.. గంగవ్వ దగ్గర ఫిష్ బౌల్ ఉంది కదా.. అందులో నుంచి ఒక చీటీ తీసి, అందులో ఇంగ్లీషులో ఒక మేటర్ ఉంటుంది. ఆ ఇంగ్లీషులో ఉండే మ్యాటర్ చదవాలి. ఆ తర్వాత ఆ పాట ఏంటో గెస్ చేయాలి” అంటూ చెబుతాడు నాగార్జున.

అనంతరం ప్రేరణ గంగవ్వ దగ్గర ఉన్న ఫిష్ బౌల్ లో నుంచి ఒక చీటీ తీసి, అందులో ఉన్న మేటర్ ను చదవడం ప్రారంభిస్తుంది. ఇక ఆమె చదివిన మ్యాటర్ ని బట్టి పవన్ కళ్యాణ్ , భూమిక నటించిన ఖుషి సినిమాలోని “అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా” అనే పాటను మిగతా కంటెస్టెంట్స్ గెస్ చేస్తారు. ఇక బిగ్ బాస్ పాట ప్లే చేయగా రోహిణి, ప్రేరణ, నయనీపావని, విష్ణు ప్రియా నలుగురు కూడా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో డాన్స్ చేసి మెప్పించారు.


ఆ తర్వాత గౌతమ్ ఛాన్స్ రాగా.. ఆయన కూడా ఆ చీటీలో ఉన్నది వినిపించారు. ఇక వెంటనే హరితేజ, ముక్కు అవినాష్ “నీ కాళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు”అంటూ పాట గెస్ చేస్తారు. ఆ తర్వాత హరితేజ, గౌతమ్, రోహిణి పాట పెర్ఫార్మెన్స్ చేయగా ఎత్తుకోవాలని గౌతమ్ తో చెబుతారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత హరితేజ వద్దులే అని చెప్పినా.. గౌతమ్ వినకుండా ఒకసారి హరితేజను, ఇంకొకసారి రోహిణి ఎత్తుకొని మరీ పెర్ఫార్మన్స్ చేశారు. ఇక అలా ఎవరికి వారు పాటలు ఇంగ్లీషులో ఉన్నవి చదవడం, ఆ తర్వాత గెస్ చేయడం చాలా సరదాగా అనిపించింది. దీనికి తోడు అమ్మాయిలు, అబ్బాయిలు ఫన్నీగా అందరిని ఆకట్టుకున్నారు.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×