BigTV English

Trinayani Serial Today November 3rd: ‘త్రినయని’ సీరియల్‌:  త్రినేత్రి మీదకు పామును వదిలిన ముక్కోటి – వల్లభను బెదిరించిన హాసిని

Trinayani Serial Today November 3rd: ‘త్రినయని’ సీరియల్‌:  త్రినేత్రి మీదకు పామును వదిలిన ముక్కోటి – వల్లభను బెదిరించిన హాసిని

trinayani serial today Episode:  మీరెవరూ భయపడవద్దు పాము కాటేసింది నన్నే అని నయని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో పావణమూర్తి కల్పించుకుని నయని ప్రాణగండం ఉందని మొదటిసారి తెలిసినప్పుడు గండం కాకుండా గాయత్రి పాపే మీ మొదటి బిడ్డ అన్న నిజం తెలిసింది. అలాగే ఇప్పుడు కూడా ఏదైనా మంచి జరుగుతుదేమో అంటాడు. ఇంతలో తిలొత్తమ్మ  తనను కాటేసేది వేరే సర్పం అని చెప్పింది కదా? అంటుంది. అందుకేనా అక్కా హాస్‌ శారీలో వచ్చావు అని అడుగుతుంది సుమన.


అవునని నయని చెప్తుంది. దీంతో వల్లభ పెద్ద మరదలుకు పిచ్చి పట్టినట్టు ఉంది. ఏది ఆ పామును రమ్మను ఇప్పుడు అంటాడు. ఆ పాము వస్తే మీరు ఇక్కడ ఉంటారా? అని హాసిని అడుగుతుంది. దీంతో తిలొత్తమ్మ నా కొడుకు భయపడతాడేమో కానీ నాకు భయం లేదు నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ పాము వస్తే నయనికి వచ్చిన కల నిజమని నమ్ముతాం. లేదంటే ఉత్తిదే అని చెప్తుంది. దీంతో నయని నేను చెప్పానుగా అయినా సరే నువ్వు వినలేదు అంటాడు విశాల్‌. ఇప్పటి వరకు నీ విషయంలో ఎలాంటి హానీ జరగలేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకుని భ్రమ పడుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు అంటాడు విశాల్‌.

మీరెవరూ వదిన మాట నమ్మడం లేదని నాకు అనిపిస్తుంది. కానీ అది నిజమే అవ్వొచ్చని నాకు అనిపిస్తుంది అని విక్రాంత్‌ అనగానే.. పాము వస్తుందేమో అందరూ చూద్దం.. అంటుంది హాసిని.. వస్తే మా అక్కను మాత్రమే కాదు అందరినీ కాటేస్తుందేమోనని బావ గారి భయం అంటుంది సుమన. దీంతో ముందు పామును రానివ్వండి.. గంట సేపు కాదు సాయంత్రం వరకు వెయిట్‌ చేద్దాం. పాము కనక రాకపోతే నయనిని ఒక మంచి డాక్టర్‌ కు చూపించడం బెటర్‌ అంటుంది తిలొత్తమ్మ.


తర్వాత తిలొత్తమ్మను గార్డెన్‌ లోకి లాక్కెళతాడు వల్లభ. దీంతో కోపంగా తిలొత్తమ్మ పిలిస్తే వచ్చేదాన్ని కదరా అంటుంది. ఎవరూ వినకూడదని ఇక్కడికి లాకొచ్చాను అంటాడు. నువ్వు ఈ ఇంట్లో విలువ లేని వాడివి అని మీ ఆవిడే అందరి ముందు అంటుంది. అలాంటి నువ్వు నాకు ముఖ్యమైన విషయం చెప్తావా? అని నిలదీస్తుంది తిలొత్తమ్మ. నిజం మమ్మీ నీ మీద ఒట్టు అంటూ పెద్దమరదలుకు కనిపించిన కొత్త పాము నాగులమ్మ, నాగులయ్య కాదు అని తను అంది కదా? అంటాడు వల్లభ. అవునని తిలొత్తమ్మ అంటుంది.

ఇంతకీ అది నువ్వు ఏ పాము అనుకున్నావు అంటూ వల్లభ అడగ్గానే నీకు తెలుసా.. అని తిలొత్తమ్మ అడుగుతుంది. తెలుసని.. నాగులయ్య, నాగులమ్మలకు పుట్టిన కొత్త పాము ఉండొచ్చని నాకు డౌటుగా ఉందని చెప్తాడు వల్లభ. ఇంతలో  కింద నుంచి పాకుతూ వచ్చిన హాసిని బుస్‌ అంటూ అరుస్తూ పైకి లేస్తుంది. దీంతో వల్లభ భయపడతాడు. తిలొత్తమ్మ భయపడుతూ..నువ్వా అంటూ భయపడతావేంటిరా..? దాన్ని ఒక్కటి కొట్టరా.. అంటుంది. దీంతో తిలొత్తమ్మ, వల్లభ ఇద్దరూ కలిసి హాసిని కొడతారు.

త్రినేత్రి అమ్మవారి గుడికి పూజ చేయడానికి వెళ్తుంది. అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేస్తుంది. ఇంతలో పాములతో అక్కడికి వచ్చిన ముక్కోటి, వైకుంఠం పాములోడితో కలిసి వచ్చి త్రినేత్రిని చూపించి ఆ అమ్మాయినే చంపాలని చెప్తారు. దీంతో పాములోడు తన బుట్టలోని పామును తీసి త్రినేత్రి మీదకు వదులుతాడు. అమ్మవారి దగ్గర పూజ చేస్తున్న త్రినేత్రి.. అమ్మవారికి ఆలయం కట్టిస్తానని ఊరి పెద్దలకు చెప్తే అక్కడికి వెళ్లి ఎవరు పూజ చేస్తారని నన్నే తిట్టారని అయినా నేను ఊరుకోనని గుడి కట్టే వరకు వదలను అంటుంది. ఇంతలో తన దగ్గరకు వచ్చిన పామును చూసి త్రినేత్రి ఏంటి కాటు వేయాలని వచ్చావా..? నా తలరాతలో పాము కాటు వేసి చనిపోవాలని రాసి పెట్టి ఉంటే అలాగే కాటు వేసి వెళ్లు అని చేయి పాము దగ్గరకు పెడుతుంది. దీంతో పాము కాటు వేయకుండా పక్కకు వెళ్లిపోతుంది. ముక్కోటి, వైకుంఠం షాక్‌ అవుతారు.

ఏదో ఆలోచిస్తూ కూర్చున్న విక్రాంత్‌ దగ్గరకు సుమన వచ్చి నయని గురించి మాట్లాడుతుంది. మా అక్క తనకే ప్రాణగండం ఉందని ఎలా కాపాడుకోవాలిన బాధపడుతుంది మా అక్క అంటుంది సుమన. దీంతో వదినకు తన దేహం మీద ఆశ లేదు. తను లేకపోతే తనను నమ్ముకున్న వాళ్లు ఏమౌతారోనని కగారుపడుతుంది. అంతే కానీ నన్ను ఊరికే విసిగించకు వెళ్లు అని తిడతాడు. దీంతో మీ వదిన గారి యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని మంచి సలహా ఇద్దామని వచ్చాను కానీ మీరేమో వెళ్లిపోమ్మంటున్నారు అని సుమన అనగానే మా అక్కకు మెదడులో నరాలు దెబ్బతిన్నాయేమో అని నాకు అనిపిస్తుందని సుమన చెప్పగానే విక్రాంత్‌ కోపంగా తిడుతూ.. నువ్వే హేళన చేస్తున్నావు త్వరలోనే అనుభవిస్తావు అంటాడు. దీంతో సుమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×