Bigg boss 9 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ 9వ సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఇకపోతే కామన్ మ్యాన్ క్యాటగిరి లో 5 మందిని హౌస్ లోకి పంపించడానికి అగ్ని పరీక్ష అంటూ ఒక షో నిర్వహించగా.. అందులో 13 మంది ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చారు. వారిలో ముగ్గురిని ఓటింగ్ ద్వారా ఎంపిక చేయగా.. మరో ఇద్దరిని అగ్నిపరీక్ష జ్యూరీస్ స్పెషల్ గా ఎంచుకున్నారు. ఇకపోతే 9 మంది సెలబ్రిటీలు, 5 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయింది.
అందులో భాగంగానే ఓటింగ్ తో సత్తా చాటుతూ ఆడియన్స్ హృదయాలను సొంతం చేసుకున్న డిమోన్ పవన్ (Demon Pawan) ఇప్పుడు 9వ కంటెస్టెంట్గా మూడవ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. అగ్ని పరీక్ష షోలో తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన పుషప్స్ చాలా వేగంగా చేస్తూ.. అటు ఫిట్నెస్ ప్రియులను కూడా అలరించారు. అంతేకాదు హౌస్ లోకి అడుగుపెట్టిన ఎనిమిదవ కంటెస్టెంట్ ప్రముఖ సెలబ్రిటీ భరణి (Bharani) తో ఏకంగా 60 పుష్ అప్స్ చాలా సునాయాసంగా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు 9వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పవన్ అక్కడ తన ఫిట్నెస్ తో.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో ఏ విధంగా నెగ్గుతారో ఇప్పుడు తెలియాల్సి ఉంటుంది.
also read:Bigg Boss 9 Telugu: జ్యూరీస్ మెచ్చిన స్పెషల్ కామనర్.. ఆరవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి!