Bigg Boss 9 Telugu:బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం అయింది. 9 మంది సెలబ్రిటీలు, 5 మంది కామనర్స్ తో ప్రారంభం అయింది ఈ షో. ఇప్పటికే హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ ఆర్టిస్ట్ తనూజ (Thanuja )హౌస్ లోకి అడుగుపెట్టగా.. రెండవ కంటెస్టెంట్గా లక్స్ పాప ఫ్లోరా షైనీ(Flora Saini) హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక మూడవ కంటెస్టెంట్గా తొలి కామనర్ గా సోల్జర్ కళ్యాణ్ (Solder Kalyan) హౌస్ లోకి అడుగుపెట్టగా.. నాల్గవ కంటెస్టెంట్ గా టాప్ కమెడియన్ ఇమ్మానుయేల్ (Emmanuel) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐదవ కంటెస్టెంట్గా జానీ మాస్టర్ లేడీ అసిస్టెంట్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఇకపోతే ఆరవ కంటెస్టెంట్ గా మాస్క్ మ్యాన్ గా పేరు సంపాదించుకొని హృదయం లేని వాడు అంటూ జ్యూరీస్ చేత చివాట్లు పడి.. ఇప్పుడు అదే జ్యూరీస్ ను మెప్పించి .. స్పెషల్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు మాస్క్ మ్యాన్ హరీష్ (Harish). సామాన్యుడి కేటగిరీలో అగ్ని పరీక్షా షోలో జడ్జెస్ పెట్టే అత్యంత కఠినమైన టాస్కులను చాలా సునాయాసంగా నెరవేర్చారు. అంతేకాదు అరగుండు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు హరీష్. హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే జడ్జ్ బిందు మాధవి చేత హృదయం లేని వాడివి. నువ్వు ఒక విషం తో సమానం అంటూ అనిపించుకొని.. ఆ తర్వాత అదే బిందు మాధవిని మెప్పించారు. ముఖ్యంగా అబద్ధం చెప్పకుండా.. తన టాలెంట్ తో ఎదుటివారిని కన్ఫ్యూజ్ చేసే సత్తా ఉన్న కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకొని ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టారు. అగ్నిపరీక్షలో తన సత్తా ఏంటో నిరూపించిన మనీష్ ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సెలబ్రిటీలతో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లతో ఏ విధంగా మాస్క్ మ్యాన్ కాస్త రియల్ హీరోగా మారుతారో చూడాలి.
హౌస్ లోకి అడుగుపెట్టగానే టాస్క్ ఇచ్చిన హరీష్..
నాగార్జున సలహా మేరకు హౌస్ లోకి అడుగుపెట్టిన హరీష్ వెంటనే శ్రేష్ఠి వర్మ, ఇమ్మానుయేల్ ఇద్దరిలో ఎవరికి ఇల్లు వూడ్చే టాస్క్ ఇస్తారు అని ప్రశ్నించారు. ఇక దాంతో హరీష్ ఎవరు హౌస్ క్లీనింగ్ చేస్తారు? అంటూ అడగగా ఇద్దరిలో ఎవరైనా ఓకే అన్నట్టు కళ్ళతోనే చెప్పేసింది శ్రేష్టి వర్మ.. అటు ఇమ్మానుయేల్ మాత్రం ఇంత పెద్దగా ఉంది. కాస్త ఆలోచించు అన్న అని చెప్పేలోపే ఇమ్మానుయేల్ చేస్తారు అంటూ టాస్క్ ఆయనకు ఇచ్చేశారు.. సో ఈవారం మొత్తం ఇమ్మానుయేల్ హౌస్ కీపింగ్ చేయబోతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ టాస్క్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. ఇక్కడ నీకు ఇంకో బెనిఫిట్ ఉంది.. హౌస్ కీపింగ్ తో పాటు టాస్క్ ఫినిష్ అవుతుంది ఇటు నీ బాడీ కూడా ఫిట్గా ఉంటుంది అంటూ జోక్ చేశారు.
also read:Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ జాబితా.. ఎవరికి అధికమంaటే?