Bigg Boss season 9: బిగ్ బాస్ షో గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షో చాలా మంది తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. ఇప్పటికీ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. బిగ్ బాస్ షో కి సంబంధించి చాలా మంది ఈ సీజన్ లో తెలిసిన గెస్టులు ఎంట్రీ ఇచ్చారు.
బిగ్బాస్ రియాలిటీ షో కి భరణి ఏడవ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. స్రవంతి అనే సీరియల్ తో ఈయనకి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలానే మెగా బ్రదర్ నాగబాబుతో కూడా మంచి రిలేషన్షిప్ భరణి కు ఉంది. భరణి షో లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు నాగార్జునతో పంచుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్ స్ట్రెంత్ గురించి టాపిక్ నడిచింది. భరణి ఆ షో లో పుషప్స్ తీశారు. పవన్ అనే పర్సన్ తో కలిసి 60 పుసెప్ట్స్ కొట్టారు.
ఫిట్నెస్ గురించి నాగార్జున
నాగార్జున ఫిట్నెస్ గురించి సినిమా ప్రేమికులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ బాగున్నావా అని అందరూ అడుగుతారు ఎక్సర్సైజ్ చేసావని ఎవరూ అడగరు. అంటూ ఒక ఇంటర్వ్యూలో చెబుతారు. నాగార్జున ఈరోజు ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటే దానికి కారణం ఎక్సర్సైజ్. ఎప్పటికీ కూడా నాగార్జున కంట్రోల్లో తన బాడీ ఉంటుంది కాబట్టి ఆయన మన్మధుడు. మొత్తానికి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఎలిమినేషన్ అవుతారు అనుకున్న క్యాండిడేట్, బోన్స్ బ్యాక్ అయ్యి హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు.