BigTV English

Bigg Boss 9 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె? ఆ వీడియోనే కారణమా?

Bigg Boss 9 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె? ఆ వీడియోనే కారణమా?

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకున్న షో ప్రస్తుతం 9వ సీజన్ ప్రసారం అవుతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికి నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. గతవారం మాస్క్ మాన్ ఎలిమినేట్ అవ్వగా ఐదవ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఇప్పటికే ఈ డబల్ ఎలిమినేషన్ గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈవారం బోల్డ్ బ్యూటీ రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుందంటూ నెట్టింట పూకార్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఒక వీడియోని అంటూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ వీడియో మేటర్ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం..


రీతూ చౌదరి ప్రైవేట్ వీడియో లీక్..

జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రీతూ చౌదరి. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు బికినీలలో ఫోటోషూట్ చేసి నెట్టింట షేర్ చేస్తుంది. అంతే కాదు కొన్ని షోలలో ఆమె చేసిన బోల్డ్ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. అలా ఒక్కసారిగా రీతు బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న రీతు చౌదరి గురించి హీరో ధర్మ మహేష్ వైఫ్ గౌతమి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.

తన భర్తతో ఆమెకు సంబంధం ఉంది అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నెట్టింట ట్రోల్స్ ను అందుకుంటుంది. దాంతో అలాంటి వ్యక్తి బిగ్ బాస్ లో ఉండడానికి వీలు లేదు అంటూ కొందరు డిమాండ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే రీతూకు ఓటింగ్ తగ్గిందని వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో ఈ వారం డేంజర్ జోన్ లో ఈ అమ్మడు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో రీతు వల్ల కంటెంట్ బాగానే లభిస్తుంది. మరి డేంజర్ జోన్ లో ఉన్న ఈమె ఎలిమినేట్ అవుతుందా..? బిగ్ బాస్ సేవ్ చేసి మరికొన్ని వారాలు కొనసాగిస్తాడు అన్నది ఆసక్తిగా మారింది..


Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. బర్త్ సర్ ప్రైజ్ లోడింగ్..

ఐదోవారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..?

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఐదవ వారం కొనసాగుతుంది. నాలుగు వారాలకు నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. ఐదో వారం బిగ్ బాస్ కొందరిని డైరెక్ట్ గా నామినేషన్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ సాధించిన ఇమాన్యుయెల్ తప్ప అందరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వీరిలో ఈ వారం ఒకరు కాదు ఇద్దరు హౌస్ నుంచి బయటకు వస్తారని టాక్. ప్రతి వారం హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడం కామన్.. అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లోరా షైనీ, రీతు చౌదరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు ఓటింగ్ ని చూస్తే తెలుస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు బయటకు వస్తారు? ఎవరు సేవ్ అవుతారో తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!

Demon Pavan : ఆడటానికి వెళ్ళావా? హగ్స్ కోసం వెళ్ళావా? యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు

Bigg Boss 9 Divya : దివ్య పిచ్చిదా? బిగ్ బాస్ తో మాట్లాడడానికి కొత్త స్ట్రాటజీ నా?

Bigg Boss 9: అర్ధరాత్రి 12 అవుతున్న అరుపులు ఆపని శ్రీజ, వరస్ట్ ప్లేయర్ అన్నందుకు విరుచుకు పడిపోయింది

Bigg Boss 9 promo : నువ్వొ వరస్ట్ ప్లేయర్. ఎంతైనా అరుచుకో, శ్రీజ దివ్య ల మధ్య బిగ్ ఫైట్

Bigg Boss : హౌస్‌లో వాటర్‌మిలన్ స్టార్ రచ్చ… ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Big Stories

×