BigTV English

Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!

Bigg Boss: బిగ్ బాస్ కోసం ఉపముఖ్యమంత్రి.. తెరుచుకున్న గేట్లు!

Bigg Boss: గత రెండు రోజుల క్రితం కన్నడ బిగ్ బాస్ షోను నిలిపివేస్తూ.. సెట్ కి తాళాలు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూల్స్ బ్రేక్ చేశారంటూ ఇటీవల హౌస్ కి సీల్ వేయడంతో పాటు కంటెస్టెంట్స్ ని కూడా థియేటర్ కి తరలించారు. అయితే మధ్యలోనే షో నిలిపివేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ బిగ్ బాస్ కోసం ఏకంగా ఉపముఖ్యమంత్రి రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


బిగ్ బాస్ హౌస్ కి సీల్..

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం తెలుగుతోపాటు కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ రియాలిటీ షో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ 12వ సీజన్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి మరీ హౌస్ కి సీల్ వేశారు.

రంగంలోకి డిప్యూటీ సీఎం..

దీంతో హోస్ట్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep), బిగ్ బాస్ నిర్వాహకుల రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం సీల్ ను ఎత్తివేసింది. ఈ మేరకు హౌస్ కి సీల్ ఎత్తివేయాలి అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) అధికారులను ఆదేశించారు. పైగా తప్పులను సరిదిద్దుకోవడానికి నిర్వాహకులకు టైం కూడా ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ..” కన్నడ బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న బిడాడిలోని జోలివుడ్ ప్రాంగణంలో బిగ్ బాస్ హౌస్ కి వేసిన సీల్ ఎత్తివేయాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించాను. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘనలను పరిష్కరించేందుకు స్టూడియోకి టైం ఇస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతను నిలబెట్టుకుంటూనే.. కన్నడ ఇండస్ట్రీ వినోద పరిశ్రమకు సపోర్ట్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నామంటూ ” ఆయన తెలిపారు.


also read:Dude Trailer: సరికొత్తగా డ్యూడ్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన హోస్ట్..

అటు హౌస్ కి సీల్ ఎత్తివేయడంతో హోస్ట్ సుదీప్ కర్ణాటక ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కి ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా..” సకాలంలో సపోర్టు ఇచ్చినందుకు డీకే శివకుమార్ కి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గందరగోళంలో భాగం కాదని అంగీకరించినందుకు అటు ప్రభుత్వానికి ఇటు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా రిక్వెస్ట్ కి వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన అంకిత భవానికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ కిచ్చా సుదీప్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

బిగ్ బాస్ కన్నడ సీజన్ 12..

బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 విషయానికి వస్తే.. 19 మంది కంటెస్టెంట్స్ తో బెంగళూరు శివారులలోని బిడాడి హోబ్లి లోని జోలివుడ్ స్టూడియోస్, అడ్వెంచర్స్ లో ఈ బిగ్ బాస్ హౌస్ సెట్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ జోలివుడ్ స్టూడియోలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయడం లేదనే ఆరోపణలతో కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బిగ్బాస్ హౌస్ కి సీల్ వేశారు. సెట్ దగ్గరలో 250 KLD సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు షో నిర్వాహకులు చెప్పినా.. అక్కడ సరైన డ్రైనేజీ కనెక్షన్స్ లేవని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సీల్ వేయగా ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునేందుకు టైం ఇస్తూ సీల్ ఎత్తివేయడం గమనార్హం.

Related News

Bigg Boss 9 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె? ఆ వీడియోనే కారణమా?

Demon Pavan : ఆడటానికి వెళ్ళావా? హగ్స్ కోసం వెళ్ళావా? యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తారు

Bigg Boss 9 Divya : దివ్య పిచ్చిదా? బిగ్ బాస్ తో మాట్లాడడానికి కొత్త స్ట్రాటజీ నా?

Bigg Boss 9: అర్ధరాత్రి 12 అవుతున్న అరుపులు ఆపని శ్రీజ, వరస్ట్ ప్లేయర్ అన్నందుకు విరుచుకు పడిపోయింది

Bigg Boss 9 promo : నువ్వొ వరస్ట్ ప్లేయర్. ఎంతైనా అరుచుకో, శ్రీజ దివ్య ల మధ్య బిగ్ ఫైట్

Bigg Boss : హౌస్‌లో వాటర్‌మిలన్ స్టార్ రచ్చ… ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Bigg Boss 9 Promo: ఎక్స్ప్లోజివ్ టాస్క్.. అదరగొట్టేసిన ఇమ్మానియేల్ !

Big Stories

×