Peddi Shooting Cancelled: రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది‘. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న చిత్రమిది. పైగా ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా వందకోట్లు అందించిన బుచ్చిబాబు ఈసారి చరణ్ కోసం ఎలాంటి కథ రెడీ చేశాడన్నది ఫ్యాన్స్, ఆడియన్స్లో ఆసక్తిని సంతరించుకుంది. అయితే, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఇవాళ జరగాల్సిన కొత్త షెడ్యూల్ అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యిందట.
పెద్ది షూటింగ్ కొత్త షెడ్యూల్ నేటి అక్టోబర్ 9 (గురువారం) నుంచి మొదలు కానుంది. ఈ షెడ్యూల్ని బుచ్చిబాబు పూణేలో ప్లాన్ చేశాడట. అక్కడ కీలక సన్నివేశాలతో పాటు కీలకమైన క్లైమాక్స్ ని ప్లాన్ చేశారు. అలాగే చరణ్, జాన్వీలపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. ఇందుకులో పూణేలో భారీ సెట్ వేశారట. ఇక ఈ షెడ్యూల్కి అంత రంగం కూడా సిద్దం చేసి నేటి నుంచి షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల ఈ షెడ్యూల్ రద్దయ్యినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణమేంటనేది తెలియదు కానీ, ఈ కీలక షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడంతో మూవీ టీం కాస్తా డిసప్పాయింట్మెంట్లో ఉందట. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఆందోళనలో ఉన్నారు.
ఇటీవల కోఠి ఉమెన్స్లో కాలేజీలో పెద్ది షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కాస్తా విరామం తీసుకున్న మూవీ టీం నేడు కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేసింది. కానీ, ఎందుకో తెలియదు ఇది క్యాన్సిల్ అయయింది. ఆ తర్వాత షెడ్యూల్ని శ్రీలంకలో ప్లాన్ చేశారట. త్వరలోనే అక్కడ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ కోసం పెద్ది టీం శ్రీలంక పయణం కానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వెంకట కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
Also Read: Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్ ఫైర్
లాంచింగ్ నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండ కూల్ గా వెళుతుంది. ఇలాంటి టైంలో పెద్ది కొత్త షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడం ఫ్యాన్స్ని కలవరపెడుతుంది. కారణం ఏమైఉంటుందా? అని తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ కొత్త షెడ్యూల్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం తెలియాల్సి ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్(శివన్న) కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందర శర్మ, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.