Samsung M07 vs Vivo Y19e vs Lava Bold N1 5G | శాంసంగ్ ఇటీవలే భారత్ మార్కెట్లో గెలాక్సీ M07 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఒక తక్కువ బడ్జెట్ ఫోన్. గెలాక్సీ M07 లో బడ్జెట్ మార్కెట్‌లో లావా బోల్డ్ N1 5G, వివో Y19e తో పోటీ పడుతోంది. ఈ మూడు ఫోన్లు ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్లు. ఈ మూడింటిలో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించేందుకు వీటి ఫీచర్లు పోల్చి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ M07 ధర ₹7,699 (4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్). లావా బోల్డ్ N1 5G ధర ₹7,499 (4GB RAM + 64GB స్టోరేజ్). వివో Y19e ధర ₹7,999 (4GB RAM + 128GB స్టోరేజ్). మూడు ఫోన్ల ధరలు ఇంచుమించు ఒకే రేంజ్ లో ఉన్నాయి.
శాంసంగ్ M07 లో 6.7-ఇంచ్ PLS LCD స్క్రీన్ ఉంది. ఇది HD+ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. లావా బోల్డ్ N1 లో 6.75-ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది. వివో Y19e లో 6.74-ఇంచ్ LCD డిస్ప్లే ఉంటుంది.
శాంసంగ్ M07 లో మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ ఉంటుంది. ఇది రోజువారీ టాస్క్‌లతో పాటు లైట్ గేమింగ్‌కు కూడా బాగా పని చేస్తుంది. లావా బోల్డ్ N1 లో యునిసోక్ T765 ప్రాసెసర్ ఉంటుంది. వివో Y19e లో యునిసోక్ T7225 చిప్‌సెట్ ఉంటుంది.
శాంసంగ్ M07 Android 15, వన్ UI 7.0 తో వస్తుంది. లావా బోల్డ్ N1 క్లీన్ Android 15 ను అందిస్తుంది. వివో Y19e Android 14, ఫన్‌టచ్ OS 14 తో వస్తుంది.
శాంసంగ్ M07 డివైస్ కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన రియర్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 8MP ఉంటుంది. లావా బోల్డ్ N1 లో 13MP AI డ్యుయెల్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. వివో Y19eలో 13MP ప్రధాన రియర్ కెమెరా ఉంటుంది.
శాంసంగ్ M07 లో 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. లావా బోల్డ్ N1 లో 5000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ ఉంటుంది. వివో Y19e లో 5500mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ ఉంటుంది.
ఈ మూడు ఫోన్లు ₹8,000 బడ్జెట్‌లో మంచి ఆప్షన్లు. మంచి ప్రాసెసర్ కావాలంటే: శాంసంగ్ M07 ని ఎంచుకోండి. మూడింటిలో అడ్వాన్స్ 5G సపోర్ట్ కావాలంటే.. లావా బోల్డ్ N1 ని బెటర్ ఆప్షన్. ఎక్కువ బ్యాటరీ, స్టోరేజ్ కావాలంటే.. వివో Y19e ని కొనండి. మీ అవసరాలను బట్టి మీరు సరైన ఫోన్‌ను ఎంచుకోవచ్చు.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే