Tirumala News: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తిరుమల గురించి ఎవరు విమర్శలు చేసినా క్షమించేది లేదని టీటీడీ పెద్దలు పదేపదే చెబుతున్నారు. అయినా కొందరు అత్యుత్సాహంతో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు మేటరేంటి?
తిరుమలపై మళ్లీ కుట్రలు
తిరుమల గిరులు నిత్యం గోవిందా గోవిందా అనే నామస్మరణతో మార్మోగుతుంటాయి. స్వామిని దర్శించుకునందుకు ప్రతీ రోజూ వేలాదిమంది అక్కడికి వస్తుంటారు. తిరుమలకు వచ్చేవారు వస్తుంటారు.. దర్శనం తర్వాత వెళ్లినవాళ్లు ఉంటారు. అలాంటి తిరుమలపై అసత్య ప్రచారం చేసేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రూల్స్ తెచ్చింది.
తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించింది. అంతేకాదు డ్రోన్లు ఎగురవేత, షూటింగ్ లు వాటిని దూరంగా పెట్టింది. అయినా ఏదో విధంగా కొందరు బురద జల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహహ్మద్ రఫీపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది.
అడ్డంగా దొరికిపోయిన ఓ వ్యక్తి
తిరుమల అన్నప్రసాదంపై కొద్దిరోజుల కిందట ఓ యువతి వీడియో చేసింది. అన్నప్రసాదం హాలులోకి వెళ్లిన నుంచి మొదలు బయటకు వచ్చేవరకు అందులో తిరుమల వైభవం గురించి వివరించింది. ఈ వీడియోను వక్రీకరిస్తూ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు మహమ్మద్ రఫీ అనే వ్యక్తి. అంతేకాదు టీటీడీ ఛైర్మన్‌ను తప్పుబడుతూ పోస్టు చేసిన ఆ వీడియో దుమారం రేగింది.
ఈ వ్యవహారం చివరకు టీటీడీ పెద్దల దృష్టికి వచ్చింది. దీనిపై టీటీడీ బోర్డు దృష్టి పెట్టింది. తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రఫీపై టీటీడీ విజిలెన్స్ శాఖ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నిసాక్షాలు పరిశీలించిన పోలీసులు రఫీపై కేసు నమోదు చేశారు.
ALSO READ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
భక్తికి రాజకీయ రంగు పులుముతూ వీడియో వైరల్ చేశాడు రఫీ. ఆ వీడియోలో భూమన పేరు ఉన్నట్లు చెబుతున్నారు కొందరు అధికారులు. మహమ్మద్ రఫీ ద్వారా మరోసారి వైసీపీ కుట్రలు బట్టబయలు అయ్యాయి. తిరుమల టార్గెట్‌గా దుష్ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యక్తులు. ఆ తరహా ప్రచారానికి చెక్ పెట్టేందుకు నిరంతర నిఘా పెట్టింది టీటీడీ. ఎప్పటికప్పుడు చర్యలకు ఉపక్రమిస్తున్నారు టీటీడీ విజిలెన్స్ వింగ్-పోలీసు అధికారులు.
తిరుమల అన్న ప్రసాదంపై వీడియో చేసిన ఓ యువతి..
ఆ వీడియోను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి
టీటీడీ చైర్మన్ ను తప్పుబడుతూ పోస్టు చేసిన రఫీ
తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం
హైదరాబాద్ కు… pic.twitter.com/uetOMoJqX6
— BIG TV Breaking News (@bigtvtelugu) October 9, 2025