Mental Health: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట సర్వసాధారణం అయ్యాయి. పని ఒత్తిడి, సంబంధాలు, సోషల్ మీడియా వాడకం వంటివి మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే.. ప్రస్తుతం శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో సమతుల్యత, ఆనందం నెలకొంటాయి.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడం కష్టం కాదు. కొన్ని చిన్న మార్పులు, సానుకూల అలవాట్లు మిమ్మల్ని ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంచుతాయి. ఇంతకీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి 5 మార్గాలు:
ప్రతిరోజూ ధ్యానం చేయండి: ధ్యానం లేదా లోతైన శ్వాస పద్ధతులు ఒత్తిడిని తగ్గించడానికి అత్యంత ప్రభావ వంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా జీవితంలో కూడా సానుకూలత పెరుగుతుంది. ఇది దృష్టిని మెరుగుపరచడానికి అంతే కాకుండా ఆందోళనను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి: మానసిక ఆరోగ్యానికి గాఢ నిద్ర చాలా అవసరం. ప్రతి రోజు రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోండి. మీ మొబైల్ ఫోన్ వాడటం లేదా రాత్రి ఆలస్యంగా.. టీ వీ చూడటం వంటివి మానుకోండి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీరు త్వరగా అలసిపోతారు. ఫలితంగా మీ మానసిక స్థితిలో కూడా మార్పులు పెరుగుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: సమతుల్య ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా అవసరం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, సీడ్స్ వంటి వాటిని మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని నివారించండి. ఎందుకంటే ఇవి మీ మానసిక స్థితి అంతే కాకుండా శక్తి స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి.
సామాజిక సంబంధాలను కొనసాగించండి: మంచి సంబంధాలు, కమ్యూనికేషన్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కుటుంబం, స్నేహితులతో బహిరంగంగా మాట్లాడండి. మీ భావోద్వేగాలను పంచుకోవడానికి సమయం కేటాయించండి. మానవ అనుబంధాలు ఒంటరితనాన్ని తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
మీకోసం సమయం కేటాయించుకోండి: బిజీగా ఉండే రోజులో మీకోసం సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. వాకింగ్‌కు వెళ్లడం అయినా, లేదా పుస్తకం చదవడం అయినా.. అది మీకు మానసికంగా విశ్రాంతినిస్తుంది.
Also Read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే..? ఇవి తింటే చాలు !
ఒంటరిగా గడపండి:
రోజులో ఎన్నో విషయాలు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని పట్టించుకోకుండా మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి. నా మనస్సుకు, నాకు తగినంత విశ్రాంతి అవసరం అని మీకు మీరే చెప్పుకోండి. ఒంటరిగా నడవడం కూడా కొన్ని సార్లు అలవాటు చేసుకోండి. మీకు మీరుగా టీ బ్రేక్ తీసుకోండి. ఇది మనం రిలాక్స్ అయ్యేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.