Bigg Boss 9 Divya: మామూలుగా తమలో తామే మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అని పిలుస్తారు. అలానే కొంతమంది తమతో తాము మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఇది సహజంగా జరుగుతుంది. అది కూడా ఒక అలవాటుగా పరిగణించవచ్చు. కానీ అలా మాట్లాడుకుంటుంటే సమాజం పిచ్చోళ్ళు అంటుంది కాబట్టి దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు బిగ్ బాస్ 31వ రోజు ఎపిసోడ్ మొదలైంది. ఎపిసోడ్ మొదలవగానే దివ్య ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఒక్కతే మాట్లాడుకుంటుంది. దివ్య మాట్లాడుతూ ప్రతివాళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆది ఎవరికి కనిపించదు. వాళ్లు జెన్యూన్. కానీ నేను ఊపిరి పీల్చిన కూడా అది నా గేమ్ నా ప్లాను అని మాట్లాడుతున్నారు. అది నా స్టేటస్ ఇది అది అంటున్నారు. ఎందుకు ఇంకా.?
సంజన గారు ఫ్లోరాకి తప్ప జరిగిన టాస్క్ వలన అందరికీ పాయింట్స్ కట్ అయ్యాయి. ఇప్పుడు అంత డిస్కషన్ పెట్టి ఇప్పుడు ఎవరి మీదకి బ్లెయిమ్ తోసేద్దామా? ఎవర్ని బ్యాడ్ గా చూపిద్దామా? ఇమ్మానుయేల్ మరియు రాము నేను భరణి గారు కరెక్ట్ గా ఆడాము అంటే శ్రీజ తట్టుకోలేదు. పక్క వాళ్ళని ఎంత పొగిడినా కూడా తట్టుకోలేరు. నేను అది రాసిస్తాను. తను గెలవడం కోసం తను ఫస్ట్ రావడం కోసం అందరిని ముంచేస్తుంది అంటూ మాట్లాడింది దివ్య.
దివ్య ఒక్కతే టేబుల్ మీద కూర్చుని మాట్లాడటం వెనక ఆంతర్యం ఏమిటి. తనను తాను స్వయంగా ప్రశ్నించుకుంటుందా. లేకపోతే ఇలా మాట్లాడటం వలన బిగ్బాస్ దృష్టిలో పడతాము. కొంత ఫుటేజ్ కలిసి వస్తుంది అని ఆలోచించుకుంటుందా అర్థం కాని విషయం.
మొత్తానికి బిగ్ బాస్ ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే, శ్రీజ గురించి దివ్య మాట్లాడ్డం దగ్గర ఎపిసోడ్ ఓపెన్ అయింది. ఎపిసోడ్ ఎండింగ్ లో శ్రీజా కి దివ్య కి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇలాంటి పరిణామాలు చూస్తున్నప్పుడే బిగ్ బాస్ స్క్రిప్ట్ ఆ అని డౌట్ కూడా వస్తుంది.
గతంలో దివ్య మాట్లాడుతూ బయట నుంచి హౌస్ మేట్స్ ను గమనించి వచ్చావు కాబట్టి ఒపీనియన్ చెప్పు అని బిగ్ బాస్ అడిగినప్పుడు. శ్రీజ దమ్ము గురించి ప్రస్తావిస్తూ హౌస్ లో ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని దివ్య అప్పుడు చెప్పింది. అయితే ఆ మాటను బలంగా దృష్టిలోకి తీసుకుంది శ్రీజ దమ్ము.
Also Read: Bigg Boss 9: అర్ధరాత్రి 12 అవుతున్న అరుపులు ఆపని శ్రీజ, వరస్ట్ ప్లేయర్ అన్నందుకు విరుచుకు పడిపోయింది