Bigg Boss 9: బిగ్బాస్ సీజన్ 9 31వ రోజు మొదలైంది. ఎవరూ లేవకముందే ఒక టేబుల్ దగ్గర కూర్చొని దివ్య తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టి. అయితే ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటో గమనించాల్సి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ మనుషులు లేరు. లేదంటే తనలో తాను మాట్లాడుకుని అలవాటు ఉందేమో ఆలోచించాలి. ఇవేవీ కాకుండా బిగ్ బాస్ దగ్గర తన ఆలోచనను చెప్పాలనుకుంటుంది కావచ్చు.
కొద్దిసేపటి తర్వాత రంజితమే సాంగ్ తో ఎపిసోడ్ మొదలైంది. రాత్రి జరిగిన టాస్కులు గురించి ఇమ్మానుయేల్ సంజనాతో టాపిక్ మొదలుపెట్టాడు. డేంజర్ హౌస్ లో హౌస్ మేట్స్ ఉండకూడదు కాబట్టి వాళ్లను బయటకు పంపే అని రీతూ చౌదరిని మరియు పవన్ ను ఉద్దేశించి చెప్పారు. బిగ్ బాస్ నిన్న జరిగిన టాస్కులు రద్దు చేయడం వలన తాను థర్డ్ లేకుంటే ఫోర్త్ కు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని సంజన బాధపడింది.
జంటగా ఉన్న ఒక కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపించి పెయింటింగ్ చూపిస్తారు. ఆ పెయింటింగ్ ను బయటకు వచ్చి డ్రాయింగ్ వేసిన తర్వాత జంటలో ఉన్న వేరొక కంటెస్టెంట్ వెళ్లి ఆ రూమ్ నుంచి బయటకు తేవాలి. ఇలా సంజన పెయింటింగ్ వేసిన వెంటనే ఫ్లోరా వెళ్లి బయటకు తెచ్చారు. ఆ తర్వాత భరణి వెళ్లి పెయింటింగ్ బయటకి తీసుకొచ్చారు. ఆ తరువాత రీతు చౌదరి, కళ్యాణ్ హౌస్ లోకి వెళ్లారు. అసలైన పెయింటింగ్ లేదు అని ఇద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు. కరెక్ట్ పెయింటింగ్ ను భరణి తేవడం వలన టాస్క్ లో గెలిచారు.
ఫ్లోరా, రీతు చౌదరి, శ్రీజ, కళ్యాణ్ ఒకేసారి లోపలికి వెళ్లారు. మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి బయటకు పట్టుకుని వచ్చారు. అయితే ఈ విషయంలో సంచాలక్ ఇమ్మానియేల్ తో తనుజ ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ రౌండ్లో సంజన ఫ్లోరా విజయం సాధించారు.
నెక్స్ట్ రౌండ్ లో సుమన్, శ్రీజ గెలిచారు. తర్వాత రీతు చౌదరి పవన్ గెలిచారు. ఈ టాస్క్ లో ఆఖరి స్థానంలో తనుజ కళ్యాణ్ నిలిచారు.
డ్రాయింగ్ గురించి ఇమ్మానుయేల్ కామెంట్రీ ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది.
బిగ్బాస్ కొత్త టాస్క్ పెట్టారు. ఎప్పటిలానే దీనికి సంచాలకులుగా ఇమ్మానుయేల్ మరియు రాము రాథోడ్ ను నిర్వహించారు. ఈ టాస్క్ లో మొదట శ్రీజ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయారు. ఎవరిని తాకకుండా మిగతా వాళ్ళని డిస్ట్రాక్ చేయొచ్చు అనే ఆప్షన్ వీరిద్దరికి ఇచ్చారు. తర్వాత రౌండ్ లో దివ్య భరణి ఎలిమినేట్ అయ్యారు. తర్వాత ఫ్లోరా సంజన ఎలిమినేట్ అయ్యారు. తర్వాత తనుజ పవన్ ఎలిమినేట్ అయ్యారు. చిన్న మిస్టేక్ వలన వీరిద్దరూ బయటికి రావాల్సి వచ్చింది. వీరిద్దరూ కాసేపు పాటు దీని గురించి డిస్కషన్ పెట్టారు. మొత్తానికి పవన్, రీతు ఈ రౌండ్లో గెలిచారు.
లీస్ట్ స్కోరర్ జంటలు తనుజ కళ్యాణ్ మరియు శ్రీజ సుమన్ శెట్టి. వీళ్లలో వరస్ట్ ప్లేయర్ ఎవరు అని లీడ్ లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ కి చెప్పే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. సుమన్ అన్నతో కంపేర్ చేస్తే శ్రీజ బాగా ఆడింది అంటూ పవన్ చెప్పాడు. రీతు మాట్లాడుతూ, కళ్యాణ్ పర్ఫామెన్స్ వీక్ ఉంది అని చెప్పింది.
ఫ్లోరా మాట్లాడుతూ సుమన్ శెట్టి అన్న ఈ 2 డేస్ లో మీ పర్ఫామెన్స్ చూస్తే, నాట్ అప్ టు ద మార్క్ పెర్ఫార్మెన్స్ వైజ్ అనిపించింది అని చెప్పింది. కళ్యాణ్ ఇంకా బాగా ఆడాల్సింది అని సంజన చెప్పింది.
దివ్య మాట్లాడుతూ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసింది. డ్రాయింగ్ విషయంలో అందరికంటే ఫాస్ట్ గా గీసింది తనుజ. అర్థం చేసుకోలేదు కళ్యాణ్ దానిని. ఆ రౌండ్ లో లాస్ట్ వరకు వచ్చారు అంటే మీ ఫాల్ట్ అని నా ఫీలింగ్ అని దివ్య చెప్పింది. అలానే శ్రీజ వరస్ట్ ప్లేయర్ అని చెప్పింది దివ్య. సుమన్ గారు 100% ఎఫర్ట్ ఇస్తున్నారు. శ్రీజ స్ట్రాటజీ వలన సుమన్ గారు 100% ఇవ్వలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. ఇమాన్యుల్ కూడా శ్రీజ వీక్ ప్లేయర్ అని చెప్పాడు. రామ్ మాట్లాడుతూ కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పాడు. బిగ్ బాస్ లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్లకు మీ ప్రదర్శనను మార్చుకోండి అని వార్నింగ్ ఇచ్చారు
ఎప్పుడైతే ఈ ఒపీనియన్స్ అయిపోయాయో వెంటనే దివ్య దానిని వరస్ట్ ప్లేయర్ అన్నందుకు నిజ ఆర్గుమెంట్ కి దిగింది. నా మీద పర్సనల్ గా నువ్వు ఏదో పెట్టుకుని ఇద్దరినీ అంటున్నావు అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని నువ్వు మామూలుగా కూడా మాట్లాడొచ్చు తెలుసా అని దివ్య అడిగింది. అర్ధరాత్రి 12 గంటలైన అరుపులు ఆపలేదు శ్రీజ. బీభత్సమైన హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.
Also Read: PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి