Bigg Boss : ఈమధ్యకాలంలో చాలామంది పాపులారిటీ సంపాదించుకోవడానికి భిన్నవిభిన్నమైన వీడియోలు చేస్తూ.. తాము అనుకున్న కలలను నెరవేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే “వాటర్ మిలన్ స్టార్” గా పేరు సొంతం చేసుకున్న దివాకర్ (Diwakar ) తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచారు. తమిళనాట వాటర్ మిలన్ స్టార్ గా పేరు సొంతం చేసుకొని.. విజయ్ కంటే తాను గొప్ప నటుడిని అని చెప్పుకుంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈయన.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తమిళ సీజన్ 9లో పాల్గొని సందడి చేస్తున్నారు. అక్కడ తన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ..” రియాలిటీ షోలో రియల్ స్టార్” అని పిలిపించుకుంటూ ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంటున్నారు. మరి ఈయన ఎవరు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? బిగ్ బాస్ లోకి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వాటర్ మిలన్ స్టార్ అలియాస్ దివాకర్.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. విచిత్రమైన వీడియోలతో.. కామెడీతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా గజినీ చిత్రంలోని సూర్యను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన తర్వాత.. ఈయనకు వాటర్ మిలన్ స్టార్ అని పేరు వచ్చింది. అలా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈయన స్వతహాగా ఫిజియోథెరపిస్ట్. గత కొద్ది రోజులుగా ఫిజియోథెరపీ ప్రాక్టీషనర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన సరదా వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆఫ్ బీట్ కంటెంట్ ఈయనకు సోషల్ మీడియాలో బలమైన అభిమానులను సంపాదించిపెట్టింది.
ALSO READ:Manchu Vishnu: MBU సీజ్.. సుదీర్ఘ ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు!
అలా తన వీడియోలతో.. రీల్స్ తో వెలుగులోకి వచ్చిన ఈయన విజయ్ కంటే గొప్ప నటుడిని అని చెప్పి.. సినిమా లవర్స్ చేత విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఈ నెగిటివిటీతోనే ఇప్పుడు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరికీ మంచి వినోదాన్ని అందిస్తూ.. ఒక గొప్ప ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రెండోసారి హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 ఇటీవల చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో ప్రారంభం అయింది. ఇందులో ఒకరిగా హౌస్ లోకి అడుగుపెట్టారు వాటర్ మిలన్ స్టార్ దివాకర్.. దివాకర్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టడంతో చాలామంది పాపులారిటీ కోసమే అడుగుపెట్టారని కామెంట్ చేశారు. కానీ హౌస్ లోకి రావడానికి అసలు ఉద్దేశంపై.. తన పరిచయ ఏవీలో మాట్లాడుతూ..” షోలో గెలిచిన డబ్బుతో ఫిజియోథెరపీ ఆస్పత్రిని నిర్మించాలని భావిస్తున్నట్లు” తెలిపారు.
మొత్తానికైతే ఎప్పుడు అందరినీ నవ్విస్తూ తన ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న వాటర్ మిలన్ స్టార్ హౌస్ లోకి అడుగుపెట్టడం వెనుక ఉన్న రహస్యం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతను కదా రియల్ స్టార్ అంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మొత్తానికైతే తన చేష్టలతోనే కాదు మాటలతో కూడా ఇండియా వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసారు వాటర్ మిలన్ స్టార్ దివాకర్.
Content King :: #Diwakar feat #Monica.#PoojaHegde gonna be jealous she didn't get to dance with #WatermelonStar 👑#BiggBoss9Tamil #BiggBossTamil9 #BiggBossTamil #VijaySethupathi pic.twitter.com/EqVNygdQD1
— Rasigan@Fan🎙️ (@Rasigan_022) October 7, 2025
Reports coming in that the entire crew from top to bottom of @vijaytelevision have never laughed their lungs out in all the past seasons
They have found a gem !! Hilarious 🤣#watermelonclub #diwarkararmy #BiggBoss9Tamil #BiggBossTamilSeason9— ash_ads (@ashads66) October 7, 2025
Watermelon Star Evlo Neram Amaithiya Irundhan, Aurora va Pathathum Ulla Erangittan 🙏😭#BiggBossTamil #BiggBossTamil9 #Diwakar pic.twitter.com/9dLUtx3PZj
— ThePanIndiaFeed (@ThePanIndiaFeed) October 7, 2025